జ్యోతిలక్ష్మి కన్నుమూత

అలనాటి నటి, ప్రముఖ డ్యాన్సర్ జ్యోతిలక్ష్మి కన్నుమూశారు. చెన్నైలో ఆమె తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. జ్యోతిలక్ష్మి సినీరంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఒకప్పుడు జ్యోతి లక్ష్మి ఐటమ్‌ సాంగ్‌ కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవారు. పలువురు దర్శకులు, నిర్మాతలు పట్టుబట్టి మరీ జ్యోతిలక్ష్మి పాటను సినిమాలో ఉండేలా చూసుకునేవారు. ప్రేక్షకులు కూడా సినిమాలో జ్యోతిలక్ష్మి పాట ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారు.  ఆమెపై చిత్రీకరించిన కొన్ని పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. […]

Advertisement
Update: 2016-08-08 21:29 GMT

అలనాటి నటి, ప్రముఖ డ్యాన్సర్ జ్యోతిలక్ష్మి కన్నుమూశారు. చెన్నైలో ఆమె తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. జ్యోతిలక్ష్మి సినీరంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఒకప్పుడు జ్యోతి లక్ష్మి ఐటమ్‌ సాంగ్‌ కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవారు. పలువురు దర్శకులు, నిర్మాతలు పట్టుబట్టి మరీ జ్యోతిలక్ష్మి పాటను సినిమాలో ఉండేలా చూసుకునేవారు. ప్రేక్షకులు కూడా సినిమాలో జ్యోతిలక్ష్మి పాట ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారు. ఆమెపై చిత్రీకరించిన కొన్ని పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. జ్యోతి లక్ష్మి 300పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, హిందీచిత్రాల్లో ఆమె నటించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News