రకుల్ కలలుకంటున్న ముహూర్తం వచ్చేస్తోంది....

ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి వెయిటింగ్. ఎప్పుడు అతడితో సినిమా చేద్దామా అని ఒకటే తహతహ. ఎట్టకేలకు ఆ ముహూర్తానికి దగ్గరపడుతోంది రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ తో కలిసి చేయాల్సిన సినిమా కు మరికొన్ని రోజుల దూరంలో ఉంది. అవును… మురుగదాస్ సినిమాలో మహేష్ బాబు హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈమధ్యే సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. కానీ రకుల్ మాత్రం ఇంకా సెట్స్ […]

Advertisement
Update: 2016-08-06 23:23 GMT

ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి వెయిటింగ్. ఎప్పుడు అతడితో సినిమా చేద్దామా అని ఒకటే తహతహ. ఎట్టకేలకు ఆ ముహూర్తానికి దగ్గరపడుతోంది రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ తో కలిసి చేయాల్సిన సినిమా కు మరికొన్ని రోజుల దూరంలో ఉంది. అవును… మురుగదాస్ సినిమాలో మహేష్ బాబు హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈమధ్యే సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. కానీ రకుల్ మాత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడా తేదీ ఫిక్స్ అయింది. ఆగస్ట్ 11 నుంచి మహేష్ బాబుతో కలిసి సెట్స్ పైకి రాబోతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ…. మహేష్ ను కలవడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నానని… ఎప్పుడెప్పుడు మహేష్ తో కలిసి వర్క్ చేస్తానా అని ఆశగా ఎదురుచూస్తున్నట్టు రకుల్ ప్రకటించింది.

కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలోనే మహేష్ తో కలిసి నటించాలనే కోరికను బయటపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ఇన్నాళ్లకు ఆమె కోరిక నెరవేరుతుంది. ఇది ఒక ఆఫర్ అనుకుంటే… స్టార్ డైరక్టర్ మురుగదాస్ తో కలిసి వర్క్ చేయాలనే కోరిక కూడా ఒకే సినిమాతో నెరవేరుతుండడంతో.. రకుల్ ఆనందానికి అవధుల్లేవ్. అందుకే తన స్టార్ హీరో, ఫేవరెట్ డైరక్టర్ ను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఆశగా ఎదురుచూస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.

Tags:    
Advertisement

Similar News