సునీత చెప్పినట్టు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయట!

అనంతపురం జిల్లా టీడీపీలో ఎవరికి వారే కింగ్‌ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. మంత్రి పదవి దక్కిన తర్వాత పరిటాల సునీత హవా ఓ రేంజ్లో సాగుతుండడంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలే పరిటాల కుటుంబానికి వ్యతిరేకంగా మారారు. జిల్లా మొత్తం తన హవాయే ఉండాలన్నట్టుగా పరిటాల సునీత తీరు ఉందని టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. శనివారం ధర్మవరంలో సీఎం పర్యటన సందర్భంగా మరోసారి టీడీపీలో విబేధాలు బహిర్గతమయ్యాయి. సీఎం పర్యటన సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే వరదాపురం సూరి ఏర్పాటు చేసిన […]

Advertisement
Update: 2016-08-07 00:34 GMT

అనంతపురం జిల్లా టీడీపీలో ఎవరికి వారే కింగ్‌ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. మంత్రి పదవి దక్కిన తర్వాత పరిటాల సునీత హవా ఓ రేంజ్లో సాగుతుండడంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలే పరిటాల కుటుంబానికి వ్యతిరేకంగా మారారు. జిల్లా మొత్తం తన హవాయే ఉండాలన్నట్టుగా పరిటాల సునీత తీరు ఉందని టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. శనివారం ధర్మవరంలో సీఎం పర్యటన సందర్భంగా మరోసారి టీడీపీలో విబేధాలు బహిర్గతమయ్యాయి. సీఎం పర్యటన సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే వరదాపురం సూరి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా మంత్రి పరిటాల సునీత బొమ్మ లేదు. అదే జిల్లాకు చెందిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఫొటోను మాత్రం ప్లెక్సీలపై ముద్రించారు. ఇతర ఎమ్మెల్యేలకు ప్లెక్సీల్లో చోటు కల్పించారు. ఒక్క పరిటాల సునీత ఫొటో మాత్రం పెట్టలేదు. కొద్దిరోజులుగా పరిటాల సునీతకు ఎమ్మెల్యే వరదాపురం సూరికి మధ్య నడుస్తున్న వివాదమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

ధర్మవరం బ్రాంచ్ కెనాల్ ఆధునికీకరణ పనుల కాంట్రాక్టు విషయంలోనే వీరిమధ్య గొడవ జరుగుతోంది. రూ. 33 కోట్ల విలువైన పనులు తమ వారికి ఇప్పించుకోవాలని సునీత ప్రయత్నిస్తుండగా… లోకల్ ఎమ్మెల్యే కాబట్టి తమకే కాంట్రాక్టు దక్కాలని సూరి డిమాండ్ చేస్తున్నారు. నిజానికి సీఎం పర్యటనలోనే పనులకు శంకుస్థాపనచేయాల్సి ఉంది. కానీ పరిటాల సునీతే కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సిందిగా అధికారులను ఆదేశించారట. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. సునీత చెప్పినట్టు నా నియోజకవర్గంలో పనిచేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను ఎమ్మెల్యే సూరి హెచ్చరించినట్టు ఒక ప్రముఖ ప్రతిక కథనం. దీంతో అధికారులు మంత్రి మాటను కాదనలేక, లోకల్‌ ఎమ్మెల్యేను ధిక్కరించలేక విలవిలలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనలో ఎక్కడా కూడా మంత్రి పరిటాల సునీత ఫొటోలు ఉండడానికి వీల్లేదని ఎమ్మెల్యే సూరి తన అనుచరులకు ఆదేశించారని చెబుతున్నారు. పరిటాల సునీత తీరును సూరినే కాదు జిల్లాలో మెజారిటీ ఎమ్మెల్యేలకు నచ్చడం లేదని చెబుతున్నారు. ఆ మధ్య రంజాన్ తోఫా సంచులపై మైనారిటీ శాఖ మంత్రి అయినప్పటికీ పల్లె రఘునాథరెడ్డి ఫొటోను ముద్రించకుండా సునీత అడ్డుకున్నారు. కేవలం తన ఫొటో మాత్రమే సంచులపై వేయించుకున్నారు. ఈ విషయంపై సీఎంకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయేసరికి రఘునాథరెడ్డి మౌనంగా ఉంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News