తండ్రి మాట కోసం కేటీఆర్ మౌనం!

ఎంసెట్ -2 పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారం సెగ మంత్రి కేటీఆర్‌కు కూడా త‌గిలింది. సోమ‌వారం సొంత జిల్లా క‌రీంన‌గ‌ర్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఆయ‌న‌కు ప‌లు విద్యార్థి సంఘాల నుంచి ప్ర‌తిఘ‌ట‌న ఎదురైంది. అయితే, ఎప్పుడూ ఎక్క‌డి మాట అక్క‌డే అప్ప‌జెప్పే కేటీఆర్ ఈసారి మాత్రం మౌనాన్నే ఆశ్రయించారు. తండ్రి మాట‌ను మీర‌కుండా మిన్న‌కుండిపోయారు. వివ‌రాలు.. క‌రీంన‌గ‌ర్ కార్పోరేష‌న్ ప‌రిధిలో జ‌రుగుతున్న ప‌లు అభివృద్ధి ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌, ఇసుక రీచ్‌ల ప‌రిశీల‌న త‌దిత‌ర కార్య‌క్ర‌మాల కోసం కేటీఆర్ క‌రీంన‌గ‌ర్ […]

Advertisement
Update: 2016-08-01 19:13 GMT
ఎంసెట్ -2 పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారం సెగ మంత్రి కేటీఆర్‌కు కూడా త‌గిలింది. సోమ‌వారం సొంత జిల్లా క‌రీంన‌గ‌ర్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఆయ‌న‌కు ప‌లు విద్యార్థి సంఘాల నుంచి ప్ర‌తిఘ‌ట‌న ఎదురైంది. అయితే, ఎప్పుడూ ఎక్క‌డి మాట అక్క‌డే అప్ప‌జెప్పే కేటీఆర్ ఈసారి మాత్రం మౌనాన్నే ఆశ్రయించారు. తండ్రి మాట‌ను మీర‌కుండా మిన్న‌కుండిపోయారు. వివ‌రాలు.. క‌రీంన‌గ‌ర్ కార్పోరేష‌న్ ప‌రిధిలో జ‌రుగుతున్న ప‌లు అభివృద్ధి ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌, ఇసుక రీచ్‌ల ప‌రిశీల‌న త‌దిత‌ర కార్య‌క్ర‌మాల కోసం కేటీఆర్ క‌రీంన‌గ‌ర్ వ‌చ్చారు. ఆయ‌న వ‌చ్చార‌ని తెలుసుకున్న ఏబీవీపీ నేత‌లు ఎంసెట్‌-2 లీకేజీపై నిల‌దీసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఆయ‌న కారు కార్పొరేష‌న్ నుంచి బ‌య‌టికి రాగానే.. అడ్డుకున్నారు. ఎంసెట్‌-2 పేప‌ర్ లీకేజీకి ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. క‌డియం, ల‌క్ష్మారెడ్డిల‌ను వెంట‌నే బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని నినాదాలు చేశారు. స‌హ‌జంగానే దూకుడుగా వ్య‌వ‌హ‌రించే కేటీఆర్ మామూలు స‌మయంలో అయితే ఘాటుగా స‌మాధానం ఇచ్చేవాడు. కానీ, మోదీ ప‌ర్య‌ట‌న ముగిసే వ‌ర‌కు బీజేపీని, దాని అనుబంధ సంఘాల నాయ‌కుల‌ను ఏమీ అన‌వ‌ద్ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో పితృవ్యాఖ్య ప‌రిపాల‌న‌లో భాగంగా త‌నను అడ్డుకున్న‌వారిపై కోపం వ‌చ్చినా.. మంత్రి ఎలాంటి స‌మాధానం చెప్ప‌కుండా వెళ్లిపోయారు.
నిత్యం బీజేపీకి అగ్గి త‌గిలేలా త‌న‌మాట‌ల‌తో చుర‌క‌లంటించేవాడు కేటీఆర్‌. మోదీ ప్ర‌స్తావ‌న వ‌స్తే.. ఒంటికాలిపై లేచేవాడు. దేశాలు తిరిగే ప్ర‌ధానికి తెలంగాణ భార‌త‌దేశంలో ఉంద‌ని తెలియ‌దా? ఎందుకు తెలంగాణ‌కు ఆయ‌న రావ‌డం లేదు? ఆయ‌న తెలంగాణ‌కు ప్ర‌ధాని కాదా? అని ప‌లుమార్లు విమ‌ర్శించాడు కేటీఆర్‌. గ్రేట‌ర్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనైతే మోదీని విమ‌ర్శ‌ల‌తో ఉతికిఆరేశాడు. ఏం చేస్తుండ‌య్యా మోదీ.. ఎవ‌రి చీపురు వారి చేతిలో పెట్టి.. ఉడ్చుకోమ‌న్న‌డు.. గింతేనా స్వ‌చ్ఛ‌భార‌త్ అంటే.. ఏపీపై త‌ల్లిప్రేమ‌, తెలంగాణ‌పై స‌వతిప్రేమ‌.. ఇదేం పాల‌న ? అంటూ బీజేపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డాడు. కానీ, ఇటీవ‌ల తెలంగాణ‌లో మోదీ ప‌ర్య‌ట‌న ఖ‌రారు కాగానే.. చివ‌రికి కేటీఆర్ కూడా బీజేపీపై ఎలాంటి వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేయ‌డం లేదు. మొత్తానికి తండ్రి మాట జ‌వ‌దాట‌ని పుత్రుడిగా నిలిచాడు కేటీఆర్‌.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News