పుణ్యకాలం గడిచిపోయింది...

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హోదా రాదన్నారాయన. ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచనే కేంద్రానికి లేదన్నారు. బంద్‌లు చేసినా ఆందోళనలు చేసినా వచ్చే ఉపయోగం ఏమీ ఉండదన్నారు. హోదా రాకపోవడం వల్ల ఎక్కువగా నష్టపోతున్నది అనంతపురం జిల్లానే అని జేసీ వ్యాఖ్యానించారు. కేంద్రం వైఖరి ఎలా ఉంటుందో కొద్ది కాలం ఎదురుచూడాలన్నారు. ఈలోపు పుణ్యకాలం (మూడేళ్లు) గడిచిపోదా అని ప్రశ్నించగా… పుణ్యకాలం ఎప్పుడో […]

Advertisement
Update: 2016-08-01 20:29 GMT

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హోదా రాదన్నారాయన. ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచనే కేంద్రానికి లేదన్నారు. బంద్‌లు చేసినా ఆందోళనలు చేసినా వచ్చే ఉపయోగం ఏమీ ఉండదన్నారు. హోదా రాకపోవడం వల్ల ఎక్కువగా నష్టపోతున్నది అనంతపురం జిల్లానే అని జేసీ వ్యాఖ్యానించారు. కేంద్రం వైఖరి ఎలా ఉంటుందో కొద్ది కాలం ఎదురుచూడాలన్నారు.

ఈలోపు పుణ్యకాలం (మూడేళ్లు) గడిచిపోదా అని ప్రశ్నించగా… పుణ్యకాలం ఎప్పుడో గడిచి పోయిందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పిన తర్వాత … టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేసినా ఏం ఉపయోగం ఉంటుందని దివాకర్ రెడ్డి ప్రశ్నించారు.

కేంద్రం నుంచి బయటకు వస్తే ప్రత్యేక హోదా గురించి ఎవరు ప్రశ్నిస్తారని టీడీపీ ఎంపీ తోట నరసింహం ప్రశ్నించారు.చట్టసభలలో ఉండే తాము సాధించాలని కృషి చేస్తున్నామని, తాము ఆ దిశలోనే వెళ్తున్నామని ఆయన అన్నారు. బిజెపి, టిడిపి కలిసి ఎన్నికలలో పోటీచేశాయని, ఇప్పటికిప్పుడు కూటమి నుంచి బయటకు రావాలనడం సరికాదని తోట అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News