పట్టిసీమ కాలువకు మళ్లీ భారీ గండి

పట్టిసీమ ద్వారా గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసేశామని చంద్రబాబు చెబుతున్నా… ఆ నీరు- ఈ నీరు కలవడానికి అనేక సమస్యలు వస్తున్నాయి. తాజాగా మరోసారి పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జిల్లాకు తరలించే కాల్వకు భారీగా గండిపడింది. కృష్ణా జిల్లా నూజివీడు మండలం సీతారామపురం వద్ద పట్టిసీమ నీరు వెళ్లే కాల్వ తెగిపోయింది. దీంతో భారీగా నీరు పంటపొలాలను ముంచెత్తుతోంది. ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండడంతో వెంటనే పట్టిసీమమోటార్లను ఆపివేశారు. మధ్యాహ్నాం తర్వాత నీటి ప్రవాహం […]

Advertisement
Update: 2016-07-31 23:44 GMT

పట్టిసీమ ద్వారా గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసేశామని చంద్రబాబు చెబుతున్నా… ఆ నీరు- ఈ నీరు కలవడానికి అనేక సమస్యలు వస్తున్నాయి. తాజాగా మరోసారి పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జిల్లాకు తరలించే కాల్వకు భారీగా గండిపడింది. కృష్ణా జిల్లా నూజివీడు మండలం సీతారామపురం వద్ద పట్టిసీమ నీరు వెళ్లే కాల్వ తెగిపోయింది. దీంతో భారీగా నీరు పంటపొలాలను ముంచెత్తుతోంది.

ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండడంతో వెంటనే పట్టిసీమమోటార్లను ఆపివేశారు. మధ్యాహ్నాం తర్వాత నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉందని అప్పుడు గండి పూడ్చే పనులు మొదలుపెడుతామని అధికారులు చెబుతున్నారు. కాల్వకు పలుచోట్ల సిమెంట్ కాంక్రీట్ వేయాల్సి ఉన్నా రికార్డుల కోసం ప్రభుత్వం హడావుడిగా నీటిని విడుదల చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతేడాది కూడా జానంపేట వద్ద ఆక్విడెక్ట్ కూడా ఇలాగే కుప్పకూలింది. తాజాగా గండిపడిన ప్రాంతాన్ని దేవినేని ఉమ పరిశీలించారు. గండి పూడ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News