కుక్క కోసం... కుటుంబంలో ముగ్గురి బ‌లి!

పెంపుడు కుక్క‌ను కాపాడ‌బోయిన ఓ కుటుంబంలో ముగ్గురు వ్య‌క్తులు క‌రెంట్‌షాక్‌తో మ‌ర‌ణించిన హృదయ విదార‌క ఘ‌ట‌న పాల‌మూరు జిల్లాలో జ‌రిగింది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కోస్గి మండ‌లం తోగాపూర్ గ్రామంలో జ‌రిగింది. గ్రామంలో తుడుం వెంక‌ట‌య్య (60) అనే వృద్ధుడు మొక్క‌జొన్న పొలం సాగుచేస్తున్నాడు. కొంత‌కాలంగా పంట‌కు అడ‌వి పందుల బెడ‌ద ఎక్కువ కావ‌డంతో.. ర‌క్ష‌ణ కోసం విద్యుత్తు కంచె ఏర్పాటు చేశాడు. ప్ర‌తిరోజు రాత్రి విద్యుత్ కంచెను ఆన్‌చేసి ఉద‌యాన్నే ఆఫ్ చేస్తాడు. శుక్ర‌వారం ఉద‌యం పొలానికి […]

Advertisement
Update: 2016-07-29 21:00 GMT
పెంపుడు కుక్క‌ను కాపాడ‌బోయిన ఓ కుటుంబంలో ముగ్గురు వ్య‌క్తులు క‌రెంట్‌షాక్‌తో మ‌ర‌ణించిన హృదయ విదార‌క ఘ‌ట‌న పాల‌మూరు జిల్లాలో జ‌రిగింది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కోస్గి మండ‌లం తోగాపూర్ గ్రామంలో జ‌రిగింది. గ్రామంలో తుడుం వెంక‌ట‌య్య (60) అనే వృద్ధుడు మొక్క‌జొన్న పొలం సాగుచేస్తున్నాడు. కొంత‌కాలంగా పంట‌కు అడ‌వి పందుల బెడ‌ద ఎక్కువ కావ‌డంతో.. ర‌క్ష‌ణ కోసం విద్యుత్తు కంచె ఏర్పాటు చేశాడు. ప్ర‌తిరోజు రాత్రి విద్యుత్ కంచెను ఆన్‌చేసి ఉద‌యాన్నే ఆఫ్ చేస్తాడు. శుక్ర‌వారం ఉద‌యం పొలానికి వెళ్లిన వెంక‌ట‌య్య‌ కంచెకు విద్యుత్తు ప్ర‌సారం నిలిపివేయ‌డం మ‌ర్చిపోయాడు. అత‌ని పెంపుడు కుక్క కంచెలో ఇరుక్కుని విల‌విల్లాడ‌టం గ‌మ‌నించాడు వెంక‌ట‌య్య. విద్యుత్తు ప్ర‌సారం నిలిపివేద్దామ‌ని చూసినా సాధ్యం కాలేదు. కుక్క ప్రాణాలు కాపాడేందుకు ఓ తాడు సాయంతో కుక్క‌ను కంచె నుంచి లాగుదామ‌ని ప్ర‌య‌త్నించాడు. కానీ వెంక‌ట‌య్య‌కూ విద్యుత్తు ప్ర‌సారం కావ‌డంతో అత‌ను కూడా దానికే అతుక్కుపోయాడు. ఇది చూసిన వెంక‌ట‌య్య కుమారుడు కిష్టప్ప (38) తండ్రిని కాపాడే ప్ర‌య‌త్నంలో కరెంటు షాక్‌కు గుర‌య్యాడు. భ‌ర్త‌, కుమారుల‌ను రక్షిద్దామ‌ని వ‌చ్చిన అమృత‌మ్మ (58) కూడా అదే విద్యుత్తు కంచెకు బ‌లైంది. దీంతో వారు ముగ్గురూ అక్క‌డే ప్రాణాలు వ‌దిలారు. పెంపుడు కుక్క‌ను కాపాడే ప్ర‌య‌త్నంలో కుటుంబంలోని ముగ్గురు వ్య‌క్తులు మ‌ర‌ణించ‌డంతో గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News