బాబుకు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సవాల్... "నేను చూడలేదమ్మ" అన్న కామినేని

తెలుగు ప్రజల దృష్టిలో టీడీపీ చేతగాని పార్టీ అన్న భావన కలుగుతుండడంతో టీడీపీ నేతలు తెలివిగా ఎదురుదాడి చేస్తున్నారు. చంద్రబాబు కేంద్రం వైఖరిపై సుతిమెత్తగా మాట్లాడుతుంటే… టీడీపీ చోట నేతలు మాత్రం ఒంటికాలిపై లేస్తున్నారు. బీజేపీకి వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు కూడా ధీటుగా జవాబు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన విమర్శలను రాజమండ్రి అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఖండించారు. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనుక్కు తీసుకోవాలని డిమాండ్ […]

Advertisement
Update: 2016-07-30 08:38 GMT

తెలుగు ప్రజల దృష్టిలో టీడీపీ చేతగాని పార్టీ అన్న భావన కలుగుతుండడంతో టీడీపీ నేతలు తెలివిగా ఎదురుదాడి చేస్తున్నారు. చంద్రబాబు కేంద్రం వైఖరిపై సుతిమెత్తగా మాట్లాడుతుంటే… టీడీపీ చోట నేతలు మాత్రం ఒంటికాలిపై లేస్తున్నారు. బీజేపీకి వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు కూడా ధీటుగా జవాబు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన విమర్శలను రాజమండ్రి అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఖండించారు. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనుక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు వెళ్తే బీజేపీకి ఒక్కసీటు కూడా రాదంటూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆకుల తీవ్రంగా స్పందించారు. ఒక సవాల్ కూడా విసిరారు. తాము ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని… ధైర్యముంటే టీడీపీ కూడా అందుకు సిద్ధపడాలన్నారు. వైసీపీ నుంచి వచ్చిన 21 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్దం కావాలని సవాల్ విసిరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు తాము ఎన్నికలకు వెళ్లేందుకు రెడీగా ఉన్నామని ఆకుల సవాల్ చేశారు.

అయితే బీజేపీలో చంద్రబాబు కోవర్టు అన్న విమర్శలు పదేపదే ఎదుర్కొంటున్న మంత్రి కామినేని శ్రీనివాస్ మాత్రం మరోలా స్పందించారు. చంద్రబాబు ఏమన్నారో నేను చూడలేదమ్మ… అదేమైనా ఉంటే కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది. చంద్రబాబు, అరుణ్ జైట్లీ మీద స్పందించే స్థాయి నాదికాదంటూ తప్పించుకున్నారు. బీజేపీపై టీడీపీ నేతలు ఓ రేంజ్‌లో దాడి చేస్తున్నా బీజేపీ మంత్రి కామినేని మాత్రం కామ్‌గా ఉండిపోయి చంద్రబాబుపై భక్తిని చాటుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News