ఇక లాభం లేదు.. ఫిరాయింపు ఎమ్మెల్యేల కొత్త ఆలోచన

వర్షాకాలం వానలను నమ్ముకుని ఎండకాలం కుండకు బొక్కెట్టుకున్నట్టుగా తయారైంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు… వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెంపు ప్రసక్తే లేదని కేంద్రం తేల్చిచెప్పిన తర్వాత కంగుతిన్నారు. నియోజవర్గాలు పెంచేలా చేస్తానని గానం చేసిన చంద్రబాబు ఇప్పుడు మాట్లాడడం లేదు. బాబు మాటలకు తాళం వేసిన వెంకయ్యను ఇప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల నుంచి తప్పించేశారు. దీంతో ఫిరాయింపుదారుల పరిస్థితి మహాభారత యుద్ధంలో కర్ణుడి క్లైమాక్స్ […]

Advertisement
Update: 2016-07-29 01:28 GMT

వర్షాకాలం వానలను నమ్ముకుని ఎండకాలం కుండకు బొక్కెట్టుకున్నట్టుగా తయారైంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు… వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెంపు ప్రసక్తే లేదని కేంద్రం తేల్చిచెప్పిన తర్వాత కంగుతిన్నారు. నియోజవర్గాలు పెంచేలా చేస్తానని గానం చేసిన చంద్రబాబు ఇప్పుడు మాట్లాడడం లేదు. బాబు మాటలకు తాళం వేసిన వెంకయ్యను ఇప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల నుంచి తప్పించేశారు. దీంతో ఫిరాయింపుదారుల పరిస్థితి మహాభారత యుద్ధంలో కర్ణుడి క్లైమాక్స్ సీన్‌లా తయారైంది.

వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కడం దాదాపు అసాధ్యమని కొందరు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. సీమలో పార్టీ ఫిరాయించిన ఒక మైనార్టీ ఎమ్మెల్యే ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నారట. టికెట్ వస్తే రానీ, పోతే పోని ఈ మూడేళ్లు సంపాదించుకుంటా. టికెట్ ఇస్తే ఖర్చు చేస్తా. లేదంటే ఆ డబ్బుతో హ్యాపీగా బతికేస్తా అని తనను కలిసిన మత పెద్దలతోనే నేరుగా చెబుతున్నారట. విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్ షాదీఖాన శంకుస్తాపన కార్యక్రమంలో నేరుగా ”మంత్రి పదవి ఎప్పుడిస్తారు సార్‌” అని చంద్రబాబునే ప్రశ్నించడం వెనుక కూడా కారణం నియోజకవర్గాల పెంపు లేదని తెలియడమేనంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా వస్తుందో రాదో కాబట్టి ఆ మంత్రి పదవి వస్తే దానితో జీవితానికి సార్థకత తెచ్చుకోవచ్చన్నది ఆయన ఆలోచన అని చెబుతున్నారు.

అయితే కుటుంబవారసత్వంగా రాజకీయం చేస్తూ వస్తున్న నేతలు మాత్రం అయోమయంలో పడ్డారు. నియోజకవర్గాలు పెరగకపోతే, వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోతే తమతోనే తమ కుటుంబ రాజకీయ చరిత్ర ముగుస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఒత్తిళ్ల వల్లే కొందరు నేతలు అప్పుడప్పుడు అస్వస్థతకు గురవుతున్నారని చెబుతున్నారు. ”మోదీ దగ్గర చంద్రబాబుకు చాలా పలుకుబడి ఉందనుకున్నాం. నియోజకవర్గాల పెంపు చంద్రబాబుకు చాలా చిన్న విషయంగా భావించాం. వచ్చే ఎన్నికల్లో స్థానాల సంఖ్య పెరిగి తప్పకుండా టికెట్ వస్తుందన్న ఉద్దేశంతోనే టీడీపీలోకి వచ్చాం. ఇప్పుడు చూస్తే తమను పట్టించుకునే వారే లేరు. ఈ విషయాన్ని మిగిలిన నేతల వద్ద చెప్పుకోవాలన్నా సిగ్గుగా ఉంది” అని ఒక సీనియర్ ఫిరాయింపు ఎమ్మెల్యే ఒక ప్రముఖ పత్రికతో వ్యాఖ్యానించడం విశేషం. పరిస్థితి ఇలా ఉంటుందని తెలిసి ఉంటే వైసీపీలోనే ఉండేవారిమి కదా అని కూడా ఆయన వ్యాఖ్యానించారట. మొత్తం మీద ఫిరాయింపుదారుల్లో పలువురు ఎమ్మెల్యేలు ఈ మూడేళ్లలో కావాల్సినంత సంపాదించుకుని, వస్తే మంత్రి పదవులు తీసుకుని ఆ తర్వాత చాపచుట్టేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఉంది. ఎటొచ్చి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌ నిలబెట్టేందుకు వచ్చిన కొందరు ఎమ్మెల్యేలకే ముప్పు పొంచి ఉంది. తరతరాల రాజకీయ చరిత్రకు తమ చేతుల మీదుగా నీళ్లొదలాల్సివస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News