ఎంసెట్‌ పేపర్ లీక్... శ్రీచైతన్యపై సీఐడీ అనుమానం

తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజ్ అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. తవ్వేకొద్ది కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పేపర్ లీకేజ్ వెనుక శ్రీచైతన్య కాలేజీకి చెందినవారి హస్తమున్నట్టు సీఐడీ భావిస్తోంది. అక్రమమార్గంలో ర్యాంకులు సంపాదించిన వారిలో అత్యధికమంది శ్రీచైతన్యకాలేజ్‌కు చెందిన వారేనని  న్యూస్ ఛానల్‌ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం. అక్రమ ర్యాంకులు పొందిన వారిలో శ్రీచైతన్యకాలేజ్ విద్యార్థులే ఎక్కువగా ఉన్నట్టు సీఐడీ గుర్తించిందని ఛానల్ చెబుతోంది. దీంతో శ్రీచైతన్య విద్యార్ధుల పాత్రపై సీఐడీ విచారణ జరుపుతోంది. ఎంసెట్ పేపర్‌ […]

Advertisement
Update: 2016-07-28 02:53 GMT

తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజ్ అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. తవ్వేకొద్ది కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పేపర్ లీకేజ్ వెనుక శ్రీచైతన్య కాలేజీకి చెందినవారి హస్తమున్నట్టు సీఐడీ భావిస్తోంది. అక్రమమార్గంలో ర్యాంకులు సంపాదించిన వారిలో అత్యధికమంది శ్రీచైతన్యకాలేజ్‌కు చెందిన వారేనని న్యూస్ ఛానల్‌ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం. అక్రమ ర్యాంకులు పొందిన వారిలో శ్రీచైతన్యకాలేజ్ విద్యార్థులే ఎక్కువగా ఉన్నట్టు సీఐడీ గుర్తించిందని ఛానల్ చెబుతోంది. దీంతో శ్రీచైతన్య విద్యార్ధుల పాత్రపై సీఐడీ విచారణ జరుపుతోంది. ఎంసెట్ పేపర్‌ సెట్ చేయడంలో పాత్ర ఉన్న మరో కార్పొరేట్ కాలేజ్ ఫ్యాకల్టీని సీఐడీ విచారిస్తోంది. మొత్తం 130 మంది విద్యార్థుల ప్రమేయం ఈ వ్యవహారంలో ఉందని తేల్చారు.

ఎంసెట్‌ పేపర్‌ లీక్‌ నిందితులను కఠినంగా శిక్షిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో మెరిట్‌ విద్యార్థులకు నష్టం కలగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంసెట్‌ రద్దు చేయవద్దంటూ కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News