రాజధానిపై కాసా జగన్‌ మోహన్‌రెడ్డి పిల్

రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంపై పునరాలోచన చేసేలా ఆదేశించాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. టీడీపీ ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశారని పిటిషన్ వేసిన హైకోర్టు న్యాయవాది కాసా జగన్‌మోహన్ రెడ్డి, వైద్యుడు ఎం. హరిబాబు పిల్‌లో తెలిపారు. ప్రస్తుతం రాజధాని కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో వరదలు, భూకంపాల ముప్పు ఉందంటూ పలు నివేదికలను పిల్ లో ప్రస్తావించారు. వ్యవసాయ భూముల్లో రాజధాని నిర్మాణం ద్వారా […]

Advertisement
Update: 2016-07-23 23:59 GMT

రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంపై పునరాలోచన చేసేలా ఆదేశించాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. టీడీపీ ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశారని పిటిషన్ వేసిన హైకోర్టు న్యాయవాది కాసా జగన్‌మోహన్ రెడ్డి, వైద్యుడు ఎం. హరిబాబు పిల్‌లో తెలిపారు. ప్రస్తుతం రాజధాని కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో వరదలు, భూకంపాల ముప్పు ఉందంటూ పలు నివేదికలను పిల్ లో ప్రస్తావించారు.

వ్యవసాయ భూముల్లో రాజధాని నిర్మాణం ద్వారా ఆహారభద్రతకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం టీడీపీ నేతలు భారీగా ముందే భూములు కొనుగోలు చేసి వాటికి విలువ వచ్చేలా రాజధాని ప్రాంతాన్ని ప్రకటించుకున్నారని పిటిషన్‌లో కోర్టుకు వివరించారు. స్వార్థప్రయోజనాలు, రియల్ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని అయితే ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం వల్ల భవిష్యత్తులో భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు నిలుస్తాయా అన్నది చూడాలి.

Click on Image to Read:

 

 

Tags:    
Advertisement

Similar News