ఫిరాయింపు సక్సెస్‌... కోడలమ్మకు బాబు కండువా

తూర్పుగోదావరి జిల్లాకుచెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీలోకి ఫిరాయించారు. కోడలి సాయంతో విజయవంతంగా అధికారపార్టీలోకి దూరిపోయారు. ఘనకార్యానికి ఘనంగా ఏర్పాట్లు చేసుకుని భారీ వాహనాలతో విజయవాడ వెళ్లిన అప్పారావుకు చంద్రబాబు స్వయంగా కండువా కప్పారు. వైసీపీ నుంచి తొలుత ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కండువా కప్పేటప్పుడు చంద్రబాబు ముఖంలో కాస్త గిల్టి ఫీలింగ్ కనిపించేది. కానీ పదేపదే కండువా కప్పేసరికి అలవాటు అయిందో ఏమో గానీ వైసీపీ ఎమ్మెల్సీ అప్పారావు మెడకు పచ్చకండువా కప్పుతున్నప్పుడు చంద్రబాబు ఏమాత్రం […]

Advertisement
Update: 2016-07-22 23:44 GMT

తూర్పుగోదావరి జిల్లాకుచెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీలోకి ఫిరాయించారు. కోడలి సాయంతో విజయవంతంగా అధికారపార్టీలోకి దూరిపోయారు. ఘనకార్యానికి ఘనంగా ఏర్పాట్లు చేసుకుని భారీ వాహనాలతో విజయవాడ వెళ్లిన అప్పారావుకు చంద్రబాబు స్వయంగా కండువా కప్పారు. వైసీపీ నుంచి తొలుత ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కండువా కప్పేటప్పుడు చంద్రబాబు ముఖంలో కాస్త గిల్టి ఫీలింగ్ కనిపించేది. కానీ పదేపదే కండువా కప్పేసరికి అలవాటు అయిందో ఏమో గానీ వైసీపీ ఎమ్మెల్సీ అప్పారావు మెడకు పచ్చకండువా కప్పుతున్నప్పుడు చంద్రబాబు ఏమాత్రం మొహమాటపడలేదు. మనం చేసిన ఘనకార్యం ఎవరూ చేసి ఉండరన్నట్టుగా ఎక్స్‌ప్రెషన్ పెట్టారు.

అందరూ ఫిరాయింపు నేతల్లాగే అప్పారావు కూడా భావం లేని ఉద్వేగానికి లోనయ్యారు. టీడీపీలోకి రావడంతో, చంద్రబాబు కండువా కప్పడంతో తన జన్మధన్యమైపోయిందన్నట్టుగా లెక్చర్ దంచారు. అచ్చం పుట్టింటికి వచ్చినట్టుగా అనిపించిందని చెప్పారు. అయితే పుట్టింటి అప్పారావు పక్కింటిలో దొరికిన ఎమ్మెల్సీ పదవి గురించి మాత్రం మాట్లాడలేదు. పార్టీకి రాజీనామా చేశారే గానీ వైసీపీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్సీ పదవి గురించి మాత్రం మాట్లాడలేదు. ఎవరైనా దీనిపై అడిగినా ఫిరాయింపు ముఠా ఇప్పటికే కనిపెట్టిన ”రాజీనామాకు మేం సిద్ధం చంద్రబాబు ఆదేశిస్తే చాలు” అన్న డైలాగు ఉండనే ఉందిగా!.

ఆదిరెడ్డి అప్పారావు ఫిరాయింపు ఘనకార్యంలో అప్పారావు కోడలిని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అప్పారావుకు కోడలైన భవాని … దివంగత ఎర్రన్నాయుడు సొంత కూతురు. ఆమె మామ కోసం పుట్టింటికి చెందిన అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు సాయంతో పైరవీలు నడిపారని చెబుతున్నారు. కోడెల సాయంతో మామ ఫిరాయించారని జిల్లాలో అందరూ చెప్పుకుంటున్నారు. అందుకే కాబోలు అప్పారావు కోడలికి చంద్రబాబు అభినందించి కండువా కప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News