ఏపీలో మరో ముడుపుల వ్యవహారం

ఏపీ మెడికల్ కౌన్సెలింగ్ లో వంద కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని కొద్ది నెలల క్రితం జాతీయ మీడియాలోనూ భారీగా కథనాలు వచ్చాయి. తాజాగా ఏపీ డైట్ సెట్ కూడా ముడుపుల వ్యవహారానికి వేదికైనట్టు కొన్ని టీవీ ఛానళ్లలో శనివారం సాయంత్రం కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీలో డైడ్‌ సెట్‌ కౌన్సిలింగ్ వాయిదా పడడం కూడా అనుమానాలకు తావిస్తోంది. కౌన్సిలింగ్ ప్రారంభమైన 24 గంట్లోనే వాయిదా వేస్తున్నట్టు మంత్రి ప్రకటించడం కలకలం రేపింది. ఈనెల 29 నుంచి కౌన్సెలింగ్ […]

Advertisement
Update: 2016-07-23 10:24 GMT

ఏపీ మెడికల్ కౌన్సెలింగ్ లో వంద కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని కొద్ది నెలల క్రితం జాతీయ మీడియాలోనూ భారీగా కథనాలు వచ్చాయి. తాజాగా ఏపీ డైట్ సెట్ కూడా ముడుపుల వ్యవహారానికి వేదికైనట్టు కొన్ని టీవీ ఛానళ్లలో శనివారం సాయంత్రం కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీలో డైడ్‌ సెట్‌ కౌన్సిలింగ్ వాయిదా పడడం కూడా అనుమానాలకు తావిస్తోంది. కౌన్సిలింగ్ ప్రారంభమైన 24 గంట్లోనే వాయిదా వేస్తున్నట్టు మంత్రి ప్రకటించడం కలకలం రేపింది. ఈనెల 29 నుంచి కౌన్సెలింగ్ తిరిగి నిర్వహిస్తామని మంత్రి గంటా చెప్పారు. అయితే హఠాత్తుగా కౌన్సెలింగ్‌ వాయిదా పడడం వెనుక భారీ ముడుపుల వ్యవహారం ఉందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కౌన్సెలింగ్‌కు అనుమతుల కోసం ఒక్కో కాలేజ్‌ నుంచి మూడు నుంచి నాలుగు లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఏపీలో మొత్తం 700కు పైగా కాలేజీల నుంచి విజయవంతంగా ముడుపులను వసూలు చేశారని తెలుస్తోంది. అయితే మరికొన్ని కాలేజీలు ముడుపులు ఇవ్వకపోవడంతో వాటికి అనుమతులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో సదరు కాలేజీలతోనూ చర్చలు సాగినట్టు చెబుతున్నారు. మిగిలిన కాలేజీల నుంచి ముడుపులు వసూలు చేసేందుకు వీలుగానే కౌన్సెలింగ్ వాయిదా వేసినట్టు కథనాలు వస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే కౌన్సెలింగ్ వాయిదా పడిన విషయం తమకు తెలియదని విద్యాశాఖ ఉన్నతాధికారులే చెబుతున్నారు. కొద్ది నెలల క్రితమే ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌లో వంద కోట్ల కుంభకోణం జరిగిందని జాతీయ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. కానీ ఎప్పటిలాగే చంద్రబాబు ప్రభుత్వం వాటిని లెక్కచేయలేదు. తాజాగా డైట్‌ సెట్‌ కౌన్స్ లింగ్‌ను కూడా ముడుపుల కోసం వాడుకున్నట్టు ఆరోపణలు రావడం ఏపీ ఇమేజ్‌కు మరో డ్యామేజే.

Click on Image to Read:

 

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News