హోదా బిల్లు కోసం నేను సభలో నినదించా... మీరు చూడలేదా...

ప్రత్యేక హోదా అంశం రాజకీయ పార్టీలకు ఒక ఆటగా తయారైంది. ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ ప్రత్యేక హోదా అంశాన్ని గండికొడుతూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ బిల్లు చర్చకు వచ్చి, ఓటింగ్ జరుగుతుందని భావించారు. కానీ బీజేపీ వ్యూహాత్మకంగా బిల్లు చర్చకు రాకుండా అడ్డుకోగలిగింది. కేవీపీ బిల్లు చర్చకు వచ్చే సమయంలో బీజేపీ … ఆప్‌ ఎంపీ భగవంత్‌ అంశాన్ని తెరపైకి తెచ్చింది. భగవంత్ లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పినప్పటికీ పార్లమెంట్‌ భద్రతకు ముప్పుతెచ్చారంటూ ఆయనపై […]

Advertisement
Update:2016-07-22 15:23 IST

ప్రత్యేక హోదా అంశం రాజకీయ పార్టీలకు ఒక ఆటగా తయారైంది. ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ ప్రత్యేక హోదా అంశాన్ని గండికొడుతూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ బిల్లు చర్చకు వచ్చి, ఓటింగ్ జరుగుతుందని భావించారు. కానీ బీజేపీ వ్యూహాత్మకంగా బిల్లు చర్చకు రాకుండా అడ్డుకోగలిగింది. కేవీపీ బిల్లు చర్చకు వచ్చే సమయంలో బీజేపీ … ఆప్‌ ఎంపీ భగవంత్‌ అంశాన్ని తెరపైకి తెచ్చింది. భగవంత్ లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పినప్పటికీ పార్లమెంట్‌ భద్రతకు ముప్పుతెచ్చారంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ సభ్యులు గొడవకు దిగారు. దీంతో రాజ్యసభను డిప్యూటీ చైర్మన్ సోమవారానికి వాయిదా వేశారు. దీంతో ప్రత్యేక హోదా ప్రైవేట్ బిల్లు మరోసారి వెనుకబడిపోయింది. తిరిగి ఈ బిల్లు ఎప్పుడు చర్చకు వస్తోందో రాజ్యసభే నిర్ణయించాలి. గత పార్లమెంట్ సమావేశాల్లోనూ కోరం లేకపోవడంతో కేవీపీ బిల్లు చర్చకు రాకుండాపోయింది. ఈసారి కాంగ్రెస్, బీజేపీలు విప్‌ జారీ చేసినా అధికారపార్టీ మాత్రం ప్రత్యేక హోదాకు గండికొట్టింది. బిల్లు చర్చకు రాకుండా చూడడమే లక్ష్యంగా అధికారపార్టీ పనిచేసింది.

ఎప్పటిలాగే సభ వాయిదా పడగానే ఆఘమేఘాల మీద తెలుగుమీడియా గొట్టాల ముందుకు వచ్చిన టీడీపీ ఎంపీలు కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదని టీడీపీ కేంద్రమంత్రి సుజనాచౌదరి ఆరోపించారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే… సుజనాచౌదరి ఇప్పటి వరకు రాజ్యసభ ఎంపీగా ప్రమాణం కూడా చేయలేదు. శుక్రవారం ఉదయమే ప్రమాణం చేద్దామనుకున్నానని అయితే కాంగ్రెస్‌ పార్టీ ఆ అవకాశం కూడా దక్కకుండా అడ్డుకుందని చెప్పుకొచ్చారు. హోదా బిల్లు కోసం నేను సభలో నినదించా మీరు చూడలేదా అని సీఎం రమేష్ మీడియాను అడిగారు. మొత్తం మీద అధికార బీజేపీ మరోసారి తమకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఇష్టం లేదని తేల్చేసింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News