కంటతడి పెట్టి మరీ వైసీపీలోకి వచ్చిన కడప నేత

ఫిరాయింపు ప్యాకేజ్‌కి, మనస్సాక్షికి మధ్య కొందరు నేతలు నలిగిపోతున్నట్టుగా ఉన్నారు. లోకేష్‌ నేతృత్వంలోని ఫిరాయింపు ప్రోత్సాహక కమిటీ ఇస్తున్న ఆఫర్లను చూసి కొందరు నేతలు పడిపోతున్నారు. అంతలోనే మనస్సాక్షిని చంపుకోలేక తిరుగుప్రయాణం కడుతున్నారు. తాజాగా కడప కార్పొరేషన్లలోని 8 మంది కార్పొరేటర్లను టీడీపీ నేతలు కొనేశారు. చంద్రబాబు స్వయంగా సోమవారం వారి మెడకు కండువా కట్టారు. అయితే ఆ ఎనిమిది మందిలో ఒకరైన కార్పొరేటర్ జమ్మిరెడ్డి ఇప్పుడు తిరిగి వైసీపీలోకి వచ్చేశారు. జమ్మిరెడ్డి తిరిగి వైసీపీలోకి వచ్చిన తర్వాత […]

Advertisement
Update: 2016-07-20 01:28 GMT

ఫిరాయింపు ప్యాకేజ్‌కి, మనస్సాక్షికి మధ్య కొందరు నేతలు నలిగిపోతున్నట్టుగా ఉన్నారు. లోకేష్‌ నేతృత్వంలోని ఫిరాయింపు ప్రోత్సాహక కమిటీ ఇస్తున్న ఆఫర్లను చూసి కొందరు నేతలు పడిపోతున్నారు. అంతలోనే మనస్సాక్షిని చంపుకోలేక తిరుగుప్రయాణం కడుతున్నారు. తాజాగా కడప కార్పొరేషన్లలోని 8 మంది కార్పొరేటర్లను టీడీపీ నేతలు కొనేశారు. చంద్రబాబు స్వయంగా సోమవారం వారి మెడకు కండువా కట్టారు. అయితే ఆ ఎనిమిది మందిలో ఒకరైన కార్పొరేటర్ జమ్మిరెడ్డి ఇప్పుడు తిరిగి వైసీపీలోకి వచ్చేశారు.

జమ్మిరెడ్డి తిరిగి వైసీపీలోకి వచ్చిన తర్వాత ఏం చెబుతున్నారంటే… ఆదివారం టీడీపీ నేతలు రాంప్రసాద్ రెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి వచ్చి వైసీపీ నేత రాణాప్రతాప్ నిన్ను హైదరాబాద్ తీసుకురమ్మన్నారంటూ వెంటపెట్టుకెళ్లారట. రాణాప్రతాప్‌ పేరు చెబితేనే తాను హైదరాబాద్ వెళ్లానని జమ్మిరెడ్డి చెబుతున్నారు. తీరా హైదరాబాద్ వెళ్లిన తర్వాత తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను టీడీపీ నేతలు లాక్కున్నారని వెల్లడించారు. అక్కడి నుంచి బలవంతంగా చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లి కండువా వేయించారన్నారు. దీంతో వైసీపీ నేత రాణాప్రతాప్ పేరు చెప్పి తనను మోసగించిన విషయం పసిగట్టానన్నారు. తాను టీడీపీలో చేరేందుకు వెళ్లలేదని చెప్పారు. ఈ విషయాన్ని వైసీపీ నేతల వద్ద కంటతడి పెట్టుకుని మరీ చెబుతున్న జమ్మిరెడ్డి … తాను పార్టీ వీడే ప్రసక్తే లేదంటున్నారు,.

అయితే చంద్రబాబుతో కండువా వేయించి 24 గంటలు కూడా గడవకముందే ఒక కార్పొరేటర్ చేజారితే అధినాయకత్వం దగ్గర తమ ఇమేజ్‌ డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశంతో టీడీపీ నేతలు పోలీసులను రంగంలోకి దింపారు. పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్ జమ్మిరెడ్డిని వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ కేసు పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు జమ్మిరెడ్డిని వెంటపెట్టుకుని వెళ్లి లోకల్ సీఐను కలిసి పరిస్థితి వివరించారు. ఆ విధంగా ఫిరాయించిన ఒక కార్పొరేటర్‌ తిరిగి సొంతగూటిలో వాలిపోయారు. అయినా టీడీపీ నేతలు పిలిస్తే నేరుగా జమ్మిరెడ్డి ఎందుకెళ్లారో?. ఇష్టం లేని వ్యక్తిని ఏకంగా చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి టీడీపీ నేతలు ఎలా కండువా కప్పించారో?. ఫిరాయింపు ప్యాకేజ్‌కి, మనస్సాక్షి మధ్య సంఘర్షణ జరిగినప్పుడు ఇలాగే ఉంటుంది మరి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News