ఫలించిన కోడలి రాయబారం... వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పార్టీకి రాజీనామా చేశారు. అందరూ ఫిరాయింపు నేతల్లానే ఆయన కూడా పార్టీకి మాత్రమే రాజీనామా చేశారు. వైసీపీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. ఈనెల 22న చంద్రబాబు సమక్షంలోనే ఆయన టీడీపీలో చేరనున్నారు. భారీ వాహనాలతో రాజమండ్రి నుంచి వెళ్లి విజయవాడలో బాబు సమక్షంలోనే అప్పారావు పార్టీ ఫిరాయించనున్నారు. ఇప్పటికే రాజమండ్రిలో చంద్రబాబుతో కూడిన ప్లెక్సీలను ఆదిరెడ్డి అప్పారావు భారీగా ఏర్పాటు చేశారు. […]

Advertisement
Update: 2016-07-19 08:54 GMT

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పార్టీకి రాజీనామా చేశారు. అందరూ ఫిరాయింపు నేతల్లానే ఆయన కూడా పార్టీకి మాత్రమే రాజీనామా చేశారు. వైసీపీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. ఈనెల 22న చంద్రబాబు సమక్షంలోనే ఆయన టీడీపీలో చేరనున్నారు. భారీ వాహనాలతో రాజమండ్రి నుంచి వెళ్లి విజయవాడలో బాబు సమక్షంలోనే అప్పారావు పార్టీ ఫిరాయించనున్నారు. ఇప్పటికే రాజమండ్రిలో చంద్రబాబుతో కూడిన ప్లెక్సీలను ఆదిరెడ్డి అప్పారావు భారీగా ఏర్పాటు చేశారు. అప్పారావుకి టీడీపీలో లైన్ క్లియర్‌ అవడం వెనుక పెద్ద తతంగమే నడిచింది. ముఖ్యంగా కోడలి సాయంతో ఆదిరెడ్డి తన ఫిరాయింపుకు లైన్ క్లియర్ చేసుకున్నారు.

అప్పారావు టీడీపీలో ఉండగానే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో విబేధాలు తీవ్రస్థాయిలో ఉండేవి. దీంతో చౌదరి పోరు పడలేక వైసీపీలోకి వచ్చేశారు. దీంతో పార్టీ అధికారంలోకి రాకపోయినా ఆదిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు జగన్‌. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి పాత పార్టీలోకి జంప్‌ చేయాలని ఆదిరెడ్డి అప్పారావు భావించారు. కానీ గోరంట్ల అడ్డుపడుతూ వచ్చారు. అయినా అప్పారావు ప్రయత్నాలు మానలేదు. ఈ విషయం తెలిసే ఆయన చేతిలో ఉన్న శాసనమండలి వైసీపీ పక్ష నేత పదవిని జగన్‌ తీసివేశారని చెబుతుంటారు. అప్పారావు స్థానంలో ఉమారెడ్డి వెంకటేశ్వర్లకు ఆ పదవి ఇచ్చారు.

ఒక వైపు టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూనే రాజమండ్రి సిటీ వైసీపీ సమన్వయకర్త పోస్టును తన కుమారుడికి ఇప్పించుకునేందుకు అప్పారావు తెరవెనుక పావులు కదిపారు. కానీ జగన్ ముందు ఆ ఎత్తు కూడా పారలేదని చెబుతున్నారు. చివరకు రాజమండ్రి సిటీ కో- ఆర్టినేటర్ పదవిని ఉండవల్లి శిష్యుడిగా చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్‌రావుకు జగన్ అప్పగించారు. దీంతో వైసీపీలో తన గుట్టు రట్టైందన్న నిర్దారణకు వచ్చిన అప్పారావు… తన వియ్యంకుడి ఫ్యామిలీ సాయంతో వేగంగా పావులు కదిపారని చెబుతున్నారు. అప్పారావు … దివంగత ఎర్రన్నాయుడుకి స్వయాన వియ్యంకుడు. అప్పారావు కుమారుడికి ఎర్రన్నాయుడు కూతురిని ఇచ్చి వివాహం చేశారు. దీంతో కోడలి ఫ్యామిలీ సభ్యులైన మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు సాయంతో టీడీపీలో చేరేందుకు అప్పారావు లైన్‌ క్లియర్ చేసుకున్నారని తెలుస్తోంది. అచ్చెన్నాయుడు కుటుంబం నుంచి వచ్చిన ఒత్తిడితో గోరంట్ల బుచ్చయ్యచౌదరి అభ్యంతరాలను కూడా పక్కనపెట్టి చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News