మ‌ద్ద‌తు ఇస్తూనే... మండిప‌డండి:  కేసీఆర్‌

నేటి నుంచి వ‌ర్షాకాల పార్ల‌మెంటు స‌మావేశాల్లో టీఆర్ ఎస్ విచిత్ర‌మైన వ్యూహంతో ముందుకు వెళ్ల‌నుంది. హైకోర్టు విభ‌జ‌న జాప్యంపై కేంద్రంపై నిర‌స‌న తెలుపుతూనే… జీఎస్టీలాంటి కీల‌క బిల్లుల ఆమోదానికి మ‌ద్ద‌తు తెలపాల‌ని నిర్ణ‌యించింది. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి రెండేళ్ల‌వుతున్నా.. ఇంత‌వ‌ర‌కూ హైకోర్టు విభ‌జ‌న జ‌ర‌గ‌నే లేదు. దీనిపై కేంద్రం స్ప‌ష్ట‌మైన స‌మాధానం చెప్ప‌డం లేదు. మ‌రోవైపు ఏపీ స‌ర్కారు కూడా స్పందించ‌డం లేదు. ఇంకోవైపు హైకోర్టు విభ‌జ‌న జ‌ర‌క్కుండానే.. ఇటీవ‌ల చేప‌ట్టిన న్యాయాధికారుల నియామం తీవ్ర ఆందోళ‌న‌ల‌కు […]

Advertisement
Update: 2016-07-17 21:00 GMT
నేటి నుంచి వ‌ర్షాకాల పార్ల‌మెంటు స‌మావేశాల్లో టీఆర్ ఎస్ విచిత్ర‌మైన వ్యూహంతో ముందుకు వెళ్ల‌నుంది. హైకోర్టు విభ‌జ‌న జాప్యంపై కేంద్రంపై నిర‌స‌న తెలుపుతూనే… జీఎస్టీలాంటి కీల‌క బిల్లుల ఆమోదానికి మ‌ద్ద‌తు తెలపాల‌ని నిర్ణ‌యించింది. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి రెండేళ్ల‌వుతున్నా.. ఇంత‌వ‌ర‌కూ హైకోర్టు విభ‌జ‌న జ‌ర‌గ‌నే లేదు. దీనిపై కేంద్రం స్ప‌ష్ట‌మైన స‌మాధానం చెప్ప‌డం లేదు. మ‌రోవైపు ఏపీ స‌ర్కారు కూడా స్పందించ‌డం లేదు. ఇంకోవైపు హైకోర్టు విభ‌జ‌న జ‌ర‌క్కుండానే.. ఇటీవ‌ల చేప‌ట్టిన న్యాయాధికారుల నియామం తీవ్ర ఆందోళ‌న‌ల‌కు దారి తీసింది. దీనిపై ప‌లువురు న్యాయ‌వాదులు, జ‌డ్జిలు పోరాటాలు చేసిన విష‌యం విదిత‌మే! అందుకే, ఈసారి స‌మావేశాల్లో ఎలాగైనా కేంద్రంతో క‌నీసం ప్ర‌క‌ట‌న అయినా చేయించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు గులాబీ నేత‌లు.
జీఎస్టీతోపాటు ప‌లుకీల‌క బిల్లుల‌ను ఈసారి పార్ల‌మెంటు స‌మావేశాల్లోనే ఎలాగైనా ఆమోదింప‌జేసుకోవాల‌ని కేంద్రం ప‌ట్టుద‌ల‌గా ఉంది. హైకోర్టు విభ‌జ‌న విష‌యంలో మ‌రీ మొండిగా వెళ్లకుండా.. కేంద్రానికి మ‌ద్ద‌తు తెలుపుతూనే నిర‌స‌న కొన‌సాగించాల‌ని కేసీఆర్ త‌న ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. హైకోర్టుతోపాటు, క్రిష్ణా న‌దీ జ‌లాలు, ఉద్యోగుల పంప‌కం ఇంకా పూర్తికానందున కేంద్రంతో క‌య్యానికి కాలుదువ్వ‌కుండా.. అనుకూల ప్ర‌క‌ట‌న చేయించుకోవాల‌న్న వ్యూహంతో కేసీఆర్ ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు.
గ‌త స‌మావేశాల‌తో పోలిస్తే.. ఈసారి గులాబీద‌ళంలో ఎంపీల సంఖ్య పెరిగింది. కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, టీడీపీ నుంచి చామకూర మ‌ల్లారెడ్డి పార్టీలో చేరారు. దీనికితోడు కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు, డీ. శ్రీ‌నివాస్‌లు రాజ్య‌స‌భ స‌భ్యులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఇప్ప‌టిదాకా రాజ్య‌స‌భ‌లో గులాబీ నేత‌ల బ‌లం కేవ‌లం ఒక్క‌రే..(కేశ‌వ‌రావు). తాజాగా మ‌రో ఇద్దరు పెర‌గ‌డంతో హైకోర్టు విభ‌జ‌న అంశం రాజ్య‌స‌భ‌లోనూ వినిపించ‌నుంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News