మానస ఉదాసీనంగా వేసినా ఏడు మార్కులు దాటలేదు

పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్యంగా విభజన హామీలు, ఫిరాయింపు రాజకీయాలు తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టాలని వైసీపీనిర్ణయించింది. స్పీకర్‌ చేతిలో అధికారాలు పెట్టేసరికి ఫుల్‌ స్టాప్‌ లేదు, కామా లేదు అంటూ అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తున్నారని వైసీపీ ఎంపీ మేకపాటి ఆక్షేపించారు. స్పీకర్‌ పరిధి నుంచి అనర్హత వేసే అధికారాన్ని తొలగించి ఈసీకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అది కూడా మూడు మాసాల్లో […]

Advertisement
Update: 2016-07-16 01:01 GMT

పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్యంగా విభజన హామీలు, ఫిరాయింపు రాజకీయాలు తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టాలని వైసీపీనిర్ణయించింది. స్పీకర్‌ చేతిలో అధికారాలు పెట్టేసరికి ఫుల్‌ స్టాప్‌ లేదు, కామా లేదు అంటూ అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తున్నారని వైసీపీ ఎంపీ మేకపాటి ఆక్షేపించారు. స్పీకర్‌ పరిధి నుంచి అనర్హత వేసే అధికారాన్ని తొలగించి ఈసీకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అది కూడా మూడు మాసాల్లో అనర్హత వేటు పడేలా చూడాలన్నారు. దీనిపై తాము పెట్టే ప్రైవేట్ బిల్లుకు ప్రజాస్వామ్యవాదులంతా మద్దతు తెలపాలన్నారు. లేకుంటే దేశంలో ప్రజాస్వామ్యం అంతర్జాతీయంగా నవ్వులపాలవుతుందన్నారు.

వైఎస్‌ తవ్విన కాలువల్లో నీరు వదిలి కృష్ణ, గోదావరిని అనుసంధానం చేశామంటూ చంద్రబాబు గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనపై గడపగడపకు వైసీపీకార్యక్రమంలో భాగంగా మానస అనే అమ్మాయితో తాను వెళ్లిన చోట మార్కులు వేయిస్తే ఎంత ఉదాసీనంగా వేసినా 7 మార్కులు మించలేదని మేకపాటి చెప్పారు. మోదీతో ఘర్షణ వద్దని చంద్రబాబే చెప్పాక ఇక ఏపీకి ఏం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. అవినీతిలో ఏపీని నెంబర్‌ వన్‌గా మార్చి తెలుగు వాళ్ల పరువును తీశారని చంద్రబాబును విమర్శించారు.

తాము కావాలనే టీడీపీని టార్గెట్ చేస్తున్నామని చెప్పడం సరికాదని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీని కాకుండా తాము ఎవరిని టార్గెట్ చేయాలని ప్రశ్నించారు. స్పీకర్ అధికారాలు దేశ వ్యాప్తంగా దుర్వినియోగం అవుతున్నాయని సాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. దీనికి చెక్ పెట్టాలన్నారు. అందుకే బిల్లు ప్రవేశపెడుతున్నామని, ప్రజాస్వామ్యం బతకాలనుకునే ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News