బిచ్చగాళ్లంటే మహాచెడ్డ చిరాకబ్బా...

తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న సమయంలో బిచ్చగాళ్లంటే చంద్రబాబుకు అస్సలు పడేది కాదు. బిల్ క్లింటన్‌ హైదరాబాద్ వచ్చిన సమయంలో ఏకంగా బిచ్చగాళ్లందరినీ తీసుకెళ్లి ఒకచోట ఉంచేశారు. బిల్‌ క్లింటన్‌ వెళ్లిన తర్వాతే వారిని బయటకు వదిలారు. గోదావరి పుష్కరాల సమయంలోనూ అదే చేశారు. తాజాగా కృష్ణా పుష్కరాల్లో బిచ్చగాళ్లను చంద్రబాబు ప్రభుత్వం నిషేధించింది. 12 రోజుల పాటు విజయవాడలో కనిపించవద్దని ఆదేశించింది. బిచ్చగాళ్ల లిస్ట్‌ను అధికారులు ఇప్పటికే సిద్దం చేస్తున్నారు. మరి మేమెట్ట బతకాలని బిచ్చగాళ్లు ఆందోళన […]

Advertisement
Update: 2016-07-14 22:53 GMT

తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న సమయంలో బిచ్చగాళ్లంటే చంద్రబాబుకు అస్సలు పడేది కాదు. బిల్ క్లింటన్‌ హైదరాబాద్ వచ్చిన సమయంలో ఏకంగా బిచ్చగాళ్లందరినీ తీసుకెళ్లి ఒకచోట ఉంచేశారు. బిల్‌ క్లింటన్‌ వెళ్లిన తర్వాతే వారిని బయటకు వదిలారు. గోదావరి పుష్కరాల సమయంలోనూ అదే చేశారు. తాజాగా కృష్ణా పుష్కరాల్లో బిచ్చగాళ్లను చంద్రబాబు ప్రభుత్వం నిషేధించింది. 12 రోజుల పాటు విజయవాడలో కనిపించవద్దని ఆదేశించింది. బిచ్చగాళ్ల లిస్ట్‌ను అధికారులు ఇప్పటికే సిద్దం చేస్తున్నారు. మరి మేమెట్ట బతకాలని బిచ్చగాళ్లు ఆందోళన చెందడం కామన్. అందుకే వారికి 12 రోజులకు నష్టపరిహారం చెల్లించనున్నారు. బిచ్చగాళ్ల వివరాలు సేకరించి ఒక్కొక్కరికి రూ. 5000 వేలు ఇవ్వనున్నారు. పుష్కరాల సమయంలో ఒక్క బిచ్చగాడు కూడా విజయవాడలో కనిపించకుండా చూడాల్సిన బాధ్యతను జిల్లా ఉన్నతాధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. బిచ్చగాళ్లను ఎందుకు నిషేధిస్తున్నారని ప్రశ్నించగా… వారుంటే పుష్కరాలకు వచ్చే భక్తుల కాళ్లకు అడ్డుపడుతారని ఒక అధికారి వ్యాఖ్యానించారు.

గోదావరి పుష్కరాల సమయంలో రాజమండ్రిలోని బిచ్చగాళ్లకు ఒక్కొక్కరికి 10వేలు ఇచ్చారు. అయినా తాము అంతకంటే ఎక్కువే సంపాదిస్తామని, కాబట్టి రాజమండ్రి వదిలి వెళ్లేది లేదని మొండికేశారు. దీంతో నేరుగా హోంమంత్రి చినరాజప్ప, మంత్రినారాయణ అధికారులను వెంటపెట్టుకుని బిచ్చగాళ్ల ప్రాంతానికి వెళ్లారు. బయోమెట్రిక్ ద్వారా వారి వేలిముద్రలు తీసుకున్నారు. గోదావరి పుష్కరాల సమయంలో నగరంలో కనిపిస్తే రేషన్ కార్డులతో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలకు అనర్హులుగా ప్రకటిస్తామని హెచ్చరించారు. దీంతో బిచ్చగాళ్లు రాజమండ్రి వదిలివెళ్లిపోయారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ప్రభుత్వం పాటించనుంది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ ప్రయత్నమని ప్రభుత్వం చెబుతోంది.

Click on Image to Read –

Tags:    
Advertisement

Similar News