స్మృతి నెత్తిపై మ‌రో పిడుగు!

మూలిగే న‌క్క‌మీద తాటిపండు పడ్డ చందంగా ఉంది కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప‌రిస్థితి. ఇప్ప‌టికే కేబినెట్‌లో కీల‌క‌శాఖ నుంచి ఆమె త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. పాపం..! స్మృతీ ఇరానీకి కొంత‌కాలంగా బ్యాడ్ టైమ్ ర‌న్ అవుతున్న‌ట్లు ఉంది. మాన‌వ వ‌న‌రుల శాఖ నుంచి త‌ప్పుకున్నాక ఆమెపై నెట్లో జోకులు… పేలుతున్నాయి. ఇవి విప‌రీతంగా షేర్ అవుతున్నాయి. అయినా.. వీటిపై స్మృతి ఇంత‌వ‌ర‌కూ స్పందించ‌లేదు. ఇవి చాల‌వ‌న్న‌ట్లుగా ఇప్పుడు ఆమె విద్యార్హ‌త వివాదం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఆమె […]

Advertisement
Update: 2016-07-14 20:01 GMT
మూలిగే న‌క్క‌మీద తాటిపండు పడ్డ చందంగా ఉంది కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప‌రిస్థితి. ఇప్ప‌టికే కేబినెట్‌లో కీల‌క‌శాఖ నుంచి ఆమె త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. పాపం..! స్మృతీ ఇరానీకి కొంత‌కాలంగా బ్యాడ్ టైమ్ ర‌న్ అవుతున్న‌ట్లు ఉంది. మాన‌వ వ‌న‌రుల శాఖ నుంచి త‌ప్పుకున్నాక ఆమెపై నెట్లో జోకులు… పేలుతున్నాయి. ఇవి విప‌రీతంగా షేర్ అవుతున్నాయి. అయినా.. వీటిపై స్మృతి ఇంత‌వ‌ర‌కూ స్పందించ‌లేదు. ఇవి చాల‌వ‌న్న‌ట్లుగా ఇప్పుడు ఆమె విద్యార్హ‌త వివాదం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఆమె డిగ్రీ వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని.. ఇటీవ‌ల అహ్మ‌ద్‌ఖాన్ అనే వ్య‌క్తి ఢిల్లీ మెట్రో పాలిట‌న్ కోర్టులో కేసు వేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆ కేసు గురువారం విచార‌ణ‌కు వ‌చ్చింది. స్మృతి ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో విద్యార్హ‌త‌ల విష‌యంలో త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది వాదించారు. దీంతో ఆమె విద్యార్హ‌త‌ల‌కు సంబంధించిన ప‌త్రాలు స‌మ‌ర్పించాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను కోర్టు ఆదేశించింది.
విద్యార్హతల విషయంలో “ఆప్” ఎమ్మెల్యేను ఆగమేఘాలమీద జైలుకు పంపించింది కేంద్రప్రభుత్వం. దాంతో “ఆప్” స్మృతి ఇరానీ, మోదీ విద్యార్హతల గురించి దేశవ్యాప్త చర్చకు తెరలేపింది. అధికారంలో ఉండడంవల్ల వాళ్లు ఇద్దరూ బయటపడ్డా ఇప్పుడు కోర్టు ఆదేశించడంతో స్మృతికి ఇబ్బందికర పరిస్థితే.
ఇదే అద‌నుగా ఆప్ స‌ర్కారు మోదీ స‌ర్కారుపై దాడి చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే మోదీ పీజీ విష‌యంలోనూ ప‌లు అభ్యంత‌రాల‌ను లేవ‌నెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ.. తాజాగా స్మృతి ఇరానీ విష‌యంలో మాట‌ల దాడిని మరింత ముమ్మ‌రం చేయాల‌ని నిర్ణయించిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు కాంగ్రెస్, స‌మాజ్ వాదీ పార్టీలు సైతం ఈ విష‌యంలో మోదీని టార్గెట్ చేసేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నాయి. ఇంత‌కాలం స్మృతికి ద‌న్నుగా నిలిచిన పార్టీ ఇక‌పైనా మ‌ద్ద‌తుగా నిలుస్తుందా? అన్న ఆందోళ‌న ఆమె అనుచ‌రుల్లో పెరిగిపోతోంది. ఇన్ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నా.. తాను ఎక్క‌డ డిగ్రీ చ‌దివింది.. ఏ సంవ‌త్స‌రంలో చ‌దివింది? స‌్మృతి ఇరానీ అధికారికంగా వెల్ల‌డించ‌క‌పోవ‌డం విశేషం. మోదీ విద్యార్హ‌త‌ల‌పై అమిత్‌షా వివ‌రాలు వెల్ల‌డించినా.. ఆప్ వాటిని న‌కిలీ స‌ర్టిఫికేట్ల‌ని తేల్చిన విష‌యం తెలిసిందే! మోదీ పేరుతో డిగ్రీ సర్టిఫికేట్ ను మీడియాముందు ప్రదర్శించినా ఆ సర్టిఫికేట్ తాలూకు మోదీని మీడియాముందు ప్రవేశపెట్టింది “ఆప్” పార్టీ. ఈ విషయంలో అధికారంలో వుండడంవల్ల మోదీ బయటపడ్డా ఆయనకు అవమానకర పరిస్థితి.

Click on Image to Read –

Tags:    
Advertisement

Similar News