నాడు నిరుపేద బాలిక... నేడు చత్తీస్‌గఢ్ నుండి ఒలింపిక్స్‌కి ఎంపికైన తొలి యువతి!
ఆ అమ్మాయి చిన్నతనంలో ఇంటింటికీ సైకిల్ మీద తిరుగుతూ పాలు అమ్మేది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఇళ్లలో సహాయకులుగా పనిచేసేవారు. ఆ అమ్మాయి ఇప్పుడు రియో ఒలింపిక్స్‌లో హాకీ క్రీడాకారిణిగా తన సత్తాని చాటబోతోంది. 16మందితో కూడిన హాకీ క్రీడాకారిణుల జట్టుకి ఎంపికైంది. ఎంత ప్రయాణం…అది ఒక కలని నిజం చేసిన ప్రయాణం….ఆమె నివసిస్తున్న ప్రదేశానికి, ఒలింపిక్స్ జరుగుతున్న బ్రెజిల్‌కి మధ్య ఉన్న దూరం గురించి కాదు…ఒక దిగువ మధ్య తరగతి అమ్మాయి, ఒక దేశానికి ప్రాతినిథ్యం […]
ఆ అమ్మాయి చిన్నతనంలో ఇంటింటికీ సైకిల్ మీద తిరుగుతూ పాలు అమ్మేది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఇళ్లలో సహాయకులుగా పనిచేసేవారు. ఆ అమ్మాయి ఇప్పుడు రియో ఒలింపిక్స్‌లో హాకీ క్రీడాకారిణిగా తన సత్తాని చాటబోతోంది. 16మందితో కూడిన హాకీ క్రీడాకారిణుల జట్టుకి ఎంపికైంది. ఎంత ప్రయాణం…అది ఒక కలని నిజం చేసిన ప్రయాణం….ఆమె నివసిస్తున్న ప్రదేశానికి, ఒలింపిక్స్ జరుగుతున్న బ్రెజిల్‌కి మధ్య ఉన్న దూరం గురించి కాదు…ఒక దిగువ మధ్య తరగతి అమ్మాయి, ఒక దేశానికి ప్రాతినిథ్యం వహించే స్థాయికి చేరడం వరకు… సాగిన ఆమె జీవన ప్రయాణం గురించి చెప్పాలంటే… మనిషికి ఏదీ అసాధ్యం కాదని ఆమె మరొకసారి రుజువుచేసింది.
చత్తీస్‌గఢ్‌కి చెందిన 22ఏళ్ల రేణుకా యాదవ్ రాజనంద్గాన్లో ఏడవ తరగతి చదువుతుండగా హాకీ ఆడటం మొదలుపెట్టింది. భూషణ్ సావో ఆమె మొదటి కోచ్. అప్పట్లో తాము రోజుకి రెండుసార్లు మాత్రమే ప్రాక్టీస్ చేసేవాళ్లమని రేణుక మాత్రం అంతకంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేసేదని సావో చెప్పారు. పదవతరగతి తరువాత రేణుక మధ్యప్రదేశ్, గ్వాలియర్‌లో ఉన్న గర్ల్స్ హాకీ అకాడమీకి సెలక్ట్ అయింది. దాంతో ఆమెకు అక్కడ ప్రీ కోచింగ్ లభించింది. అప్పటి నుండి ఆమె హాకీ క్రీడని జీవత ధ్యేయంగా మార్చుకుంది.
కొంతకాలంగా రేణుక జాతీయ మహిళల హాకీ టీములో ఆడుతోంది. రియో ఒలింపిక్స్‌కి ఎన్నికైన అద్భుత క్షణాలను తన జీవితంలో మర్చిపోలేనని ఆమె తెలిపింది. రేణుక ప్రస్తుతం ముంబయిలోని సెంట్రల్ రైల్వేలో టికెట్ ఎగ్జామినర్‌గా పనిచేస్తోంది. ఆమె చత్తీస్గఢ్నుండి 2016 రియో ఒలిపింక్స్కి అర్హత సాధించిన వారిలో చిన్నవయసు చిన్నక్రీడాకారిణి. అంతేకాక లెస్లీ క్లాడియస్ అనే పురుష హాకీ ఆటగాడి తరువాత చత్తీస్గడ్ నుండి ఒలింపిక్స్ వెళుతున్న హాకీ క్రీడాకారిణి ఆమే. తమ రాష్ట్రం తరపున ఒలింపిక్స్‌కి ఎంపికైన మొట్టమొదటి మహిళ కూడా రేణుకే. ఇవన్నీ కాకుండా 36ఏళ్ల తరువాత ఒలింపిక్స్‌కి వెళుతున్న భారత మహిళల హాకీ జట్టు కూడా వీరిదే కావటం విశేషం. ఇన్ని విశేషాలతో ఒలింపిక్స్‌కి వెళుతున్న రేణుక పతకం సాధిస్తుందని ఆశిద్దాం.