రంగంలోకి ట్ర‌బుల్ షూట‌ర్‌.. దారికొస్తున్న భూ నిర్వాసితులు!

గులాబీ పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ అన‌గానే అంద‌రికీ గుర్తొచ్చేది హ‌రీశ్‌రావు పేరే! ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌డం ఆయ‌న‌కు తెలిసినంత‌గా ఆ పార్టీలో మ‌రెవ‌రికీ తెలియ‌దు. మాట‌ల‌తో, చేత‌ల‌తో మెప్పించ‌గ‌ల‌డ‌న్న న‌మ్మకం కేసీఆర్ తో స‌హా పార్టీ శ్రేణులంద‌రికీ ఉండ‌టం ఆయ‌న ప‌నితీరుకు నిద‌ర్శ‌నం. పార్టీకి క్లిష్ట ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు ఆయ‌న్నే రంగంలోకి దింపుతారు కేసీఆర్‌. తాజాగా మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ విష‌యంలో విప‌క్షాలు, స్వ‌చ్ఛంద సంఘాలు ఒక్క‌తాటిపైకి వ‌చ్చాయి. భూనిర్వాసితుల‌కు మ‌ద్ద‌తుగా ప‌లు ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు చేప‌ట్టాయి. ఈ విష‌యంలో […]

Advertisement
Update: 2016-07-12 22:08 GMT
గులాబీ పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ అన‌గానే అంద‌రికీ గుర్తొచ్చేది హ‌రీశ్‌రావు పేరే! ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌డం ఆయ‌న‌కు తెలిసినంత‌గా ఆ పార్టీలో మ‌రెవ‌రికీ తెలియ‌దు. మాట‌ల‌తో, చేత‌ల‌తో మెప్పించ‌గ‌ల‌డ‌న్న న‌మ్మకం కేసీఆర్ తో స‌హా పార్టీ శ్రేణులంద‌రికీ ఉండ‌టం ఆయ‌న ప‌నితీరుకు నిద‌ర్శ‌నం. పార్టీకి క్లిష్ట ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు ఆయ‌న్నే రంగంలోకి దింపుతారు కేసీఆర్‌. తాజాగా మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ విష‌యంలో విప‌క్షాలు, స్వ‌చ్ఛంద సంఘాలు ఒక్క‌తాటిపైకి వ‌చ్చాయి. భూనిర్వాసితుల‌కు మ‌ద్ద‌తుగా ప‌లు ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు చేప‌ట్టాయి. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం శ‌క్తిమేర‌కు ప‌రిహారం ఇస్తామ‌న్నా..ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వాన్ని బాగానే ఇరుకున పెట్టాయి. దీంతో క్ర‌మంగా ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త మొద‌ల‌య్యే అవ‌కాశాలు ప్రారంభ‌మ‌య్యాయి.
దీంతో ఇక్క‌డే కేసీఆర్ త‌న చ‌తుర‌త వాడారు. త‌న అమ్ముల‌పొదిలోని హ‌రీశ్ అనే అస్త్రాన్నిసంధించారు. దీంతో రంగంలోకి దిగిన హ‌రీశ్ మొన్న ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డికి సూచ‌న‌లు చేసి నిర్వాసితుల‌తో మాట్లాడించారు. చ‌ర్చ‌లు స‌ఫ‌లంకావ‌డంతో లక్ష్మాపూర్ వాసులు భూములు ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చారు. వారు చెప్పిన డిమాండ్ల‌కు ప్ర‌భుత్వం అంగీకారం తెలప‌డంతో ఊరును వ‌దులుకునేందుకు రైతులు సిద్ధ‌ప‌డ్డారు. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌ను వ్య‌తిరేకిస్తూ.. 3 నెల‌ల‌పాటు తీవ్ర ఉద్య‌మం చేసిన‌ ఏటిగ‌డ్డ కిష్టాపూర్ ప్ర‌జ‌లు మ‌న‌సు మార్చుకోవ‌డం హ‌రీశ్ సాధించిన విజ‌యంగా చెప్పుకోవాలి. ఆయ‌నే స్వ‌యంగా గ్రామ‌స్థుల‌తో మాట్లాడి వారి డిమాండ్ల‌ను నెర‌వేర్చేందుకు హామీ ఇవ్వ‌డంతో గ్రామ‌స్థులు భూములు ఇవ్వ‌డానికి అంగీక‌రించారు. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌ ప్రాజెక్టు కింద మొత్తం 14 గ్రామాలు ముంపున‌కు గుర‌వుతున్నాయి. ఈ అన్ని గ్రామాల కంటే ఎక్కువ‌గా ఈ ప్రాజెక్టును ఏటిగ‌డ్డ కిష్టాపూర్ వాసులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. 3 నెల‌ల‌పాటు ఉద్య‌మాన్ని హోరెత్తించారు. కానీ, హ‌రీశ్ రంగంలోకి దిగ‌డంతో వారు శాంతించారు. ప‌రిహారం విష‌యంలో ఇచ్చిన హామీతో సంతృప్తి చెందడమే ఇందుకు కార‌ణం. మొత్తానికి ట్ర‌బుల్ షూట‌ర్ అన్న పేరును హ‌రీశ్ మ‌రోసారి నిల‌బెట్టుకున్నారు.

Click on Image to Read –

Advertisement

Similar News