కేసీఆర్ ఆధునిక‌ అశోకుడు:  సూప‌ర్ స్టార్ కృష్ణ‌

అశోకుడు ర‌హ‌దారుల‌కు ఇరువైపులా చెట్లు నాటించెను.. అని మ‌నం చిన్న‌ప్పుడు చ‌దువుకున్నాం. అయితే, ఈ కాలంలో తిరిగి అదే ప‌ని చేస్తోన్న తెలంగాణ  సీఎం కేసీఆర్ ఆధునిక అశోకుడు అని అభివ‌ర్ణించారు న‌ట‌శేఖ‌రుడు, సూప‌ర్‌స్టార్ కృష్ణ‌.  హైద‌రాబాద్‌లో చేప‌ట్టిన హ‌రిత‌హారంలో సూప‌ర్ స్టార్ కృష్ణ, ఆయ‌న స‌తీమ‌ణి విజ‌య‌నిర్మ‌ల పాల్గొన్నారు. ఆయ‌న కూడా త‌న వంతుగా ఒక మొక్క నాటారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ హ‌రిత‌హారానికి అభినంద‌న‌లు తెలిపారు. త‌న‌కు ప‌చ్చ‌ద‌న‌మంటే ప్రాణ‌మ‌ని.. ఇంటి స్థ‌లంలో 3 […]

Advertisement
Update: 2016-07-12 21:00 GMT
అశోకుడు ర‌హ‌దారుల‌కు ఇరువైపులా చెట్లు నాటించెను.. అని మ‌నం చిన్న‌ప్పుడు చ‌దువుకున్నాం. అయితే, ఈ కాలంలో తిరిగి అదే ప‌ని చేస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధునిక అశోకుడు అని అభివ‌ర్ణించారు న‌ట‌శేఖ‌రుడు, సూప‌ర్‌స్టార్ కృష్ణ‌. హైద‌రాబాద్‌లో చేప‌ట్టిన హ‌రిత‌హారంలో సూప‌ర్ స్టార్ కృష్ణ, ఆయ‌న స‌తీమ‌ణి విజ‌య‌నిర్మ‌ల పాల్గొన్నారు. ఆయ‌న కూడా త‌న వంతుగా ఒక మొక్క నాటారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ హ‌రిత‌హారానికి అభినంద‌న‌లు తెలిపారు. త‌న‌కు ప‌చ్చ‌ద‌న‌మంటే ప్రాణ‌మ‌ని.. ఇంటి స్థ‌లంలో 3 వంతులు మొక్క‌లే ఉంటాయ‌న్నారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు కేసీఆర్ చేప‌ట్టిన కార్య‌క్ర‌మాన్ని అభినందించారు. ఆయ‌నకు ఆధునిక అశోకుడు అని కితాబిచ్చారు.
ఒక‌ప్పుడు జై ఆంధ్రా ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప‌లికి, ప్ర‌చారం చేసిన సూప‌ర్ స్టార్ కృష్ణ ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ను అభినందించ‌డంపై ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. విడిపోయినా సోద‌ర‌భావంతో ముందుకు పోతుండ‌టాన్ని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. మొన్న‌టికి మొన్న క‌రుడుగ‌ట్టిన స‌మైక్యాంధ్ర ఉద్య‌మ నేత టీజీ వెంక‌టేశ్ ను క‌రీంన‌గ‌ర్‌లో తెలంగాణ‌వాసులు భారీగా స‌న్మానించారు. తాజాగా సూప‌ర్‌స్టార్ కృష్ణ‌.. తెలంగాణ సీఎంను ప్ర‌శంస‌ల‌తో స‌న్మానించారు. విభ‌జ‌న అనంత‌రం విద్వేషాలు పెరుగ‌తాయ‌ని వారే.. ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవ‌డాన్ని తెలుగుప్ర‌జ‌లు స్వాగ‌తిస్తున్నారు.

Click on Image to Read –

Tags:    
Advertisement

Similar News