వైసీపీకి ఇక ఆ భయం కూడా ఉండదా?

తెలుగుగ్లోబల్. కామ్-  ఆంధ్రప్రదేశ్‌లో చిన్న వయసులోనే పార్టీ పెట్టి హేమాహేమీలనే ఢీకొట్టి పార్టీని నిలుపుకున్న వ్యక్తిగా జగన్‌ తప్ప మరొకరు కనిపించరు. అధికారానికి 20 అడుగుల దూరంలో వైసీపీ నిలిచిపోయినా దాని సామర్థ్యంపై అందరిలోనూ నమ్మకం కుదిరింది. అసలు రాష్ట్ర విభజన జరిగి ఉండకపోయినా, కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు అవసరమన్న భావన జనంలో కలిగిఉండకపోయినా ఈపాటికి జగనే సీఎం అయి ఉండేవారని చాలా మంది భావన. అదే సమయంలో ఎన్నికలప్పుడు జగన్‌ చేసిన తప్పులు […]

Advertisement
Update: 2016-07-13 10:19 GMT

తెలుగుగ్లోబల్. కామ్- ఆంధ్రప్రదేశ్‌లో చిన్న వయసులోనే పార్టీ పెట్టి హేమాహేమీలనే ఢీకొట్టి పార్టీని నిలుపుకున్న వ్యక్తిగా జగన్‌ తప్ప మరొకరు కనిపించరు. అధికారానికి 20 అడుగుల దూరంలో వైసీపీ నిలిచిపోయినా దాని సామర్థ్యంపై అందరిలోనూ నమ్మకం కుదిరింది. అసలు రాష్ట్ర విభజన జరిగి ఉండకపోయినా, కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు అవసరమన్న భావన జనంలో కలిగిఉండకపోయినా ఈపాటికి జగనే సీఎం అయి ఉండేవారని చాలా మంది భావన. అదే సమయంలో ఎన్నికలప్పుడు జగన్‌ చేసిన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. కేవలం జనబలాన్ని నమ్ముకున్న జగన్ వ్యూహాత్మక తప్పిదాలు చేశారని చెబుతుంటారు.

రాష్ట్ర విభజన తర్వాత తప్పనిసరిగా అనుభవం ఉన్న నాయకత్వం అవసరమన్న పాయింట్ డామినేట్ చేస్తుందని తెలిసినా అందుకు విరుగుడుగా జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. ఆ విషయంలో కిందమీద పడి చంద్రబాబు సక్సెస్‌ అయ్యారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరిని బతిమలాడుకుని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి జిల్లాలోనూ కాస్తోకూస్తో పట్టున్న కాంగ్రెస్ నాయకులను (చివరకు పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జేసీని కూడా) మోహమాటం లేకుండా తీసుకొచ్చుకున్నారు. జగన్ వెంట అనుభవం ఉన్న నాయకుల కొరత కనిపించింది. కొందరు అనుభవస్తులున్నా వారు జనాల్లో నమ్మకం కలిగించలేకపోయారు. ఓటింగ్‌కు వెళ్లే సమయంలో ఇరు పార్టీ శ్రేణుల బలాబలాలను గమనించిన ప్రజలకు వైసీపీ నుంచి ఒక్క జగన్‌ మాత్రమే కనిపించారు. జగన్‌ టీం చెప్పుకునే స్థాయిలో కనిపించలేదు. దీని వల్లే కొత్తవాడైన జగన్‌ చేతిలో రాష్ట్రం పెడితే ఏం జరుగుతుందోనన్న అనుమానం జనంలో కలిగింది.

టీడీపీకి బద్దశత్రులుగా పేరున్న అనేక మంది కాంగ్రెస్ సీనియర్లు , వైఎస్ మీద అభిమానం ఉన్న నాయకులు పిలిస్తే పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా జగన్ అటువైపుగా ప్రయత్నాలు చేసిన దాఖలాలు కనిపించలేదు. అలాంటి వాళ్లను 2014 ఎన్నికల్లో జగన్ వాడుకోలేకపోవడంతో పార్టీ నష్టపోయింది. అది కూడా చంద్రబాబుకు బాగా కలిసి వచ్చింది. పైగా ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల ఫిరాయింపులు కూడా జగన్‌కు మంచి అనుభవాన్నే నేర్పి ఉండాలి. ఎందుకంటే ఫిరాయిస్తున్న నేతల్లో దాదాపు అందరూ కూడా టీడీపీ నుంచి వచ్చిన నేతలే. అంటే టీడీపీ వాసనలు వారిని వదలలేదు. కాంగ్రెస్‌ను వీడి వచ్చిన వారిలో కొందరు తప్పితే మిగిలిన వారు జగన్‌తోనే నిలబడ్డారు. ఇక్కడే జగన్‌కు తనవారు ఎవరు? కానీ వారు ఎవరన్న విషయం అర్థమై ఉండాలి?.

జగన్‌ తన మేనల్లుడు అని కేవీపీ అన్నప్పుడు, ఉండవల్లిని జగన్ కలిసినప్పుడు వైసీపీ అభిమానుల నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీన్ని బట్టే పార్టీ శ్రేణులు కూడా గతంలో వైఎస్ వెంట నడిచిన టీమే జగన్‌ వెంట ఉండాలని ఆశిస్తున్నట్టుగా ఉంది. ఒక వేళ 2014 ఎన్నికలకు ముందే వైఎస్‌కు అభిమానులుగా పేరున్న కాంగ్రెస్‌ కీలక నేతలను జగన్ రప్పించుకుని ఉంటే ఫలితం మెరుగ్గానే ఉండేది కాబోలు. జగన్‌ను సంప్రదించి ఆయన కాదన్న తర్వాత అయిష్టంగానే టీడీపీలోకి వెళ్లిన కాంగ్రెస్ నేతలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారిలో కొందరు మంత్రులయ్యారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ పొరపాట్లను జగన్‌ గమనించినట్టే ఉన్నారు. అందుకే బొత్సను పార్టీలో చేర్చుకున్నారు. ఉండవల్లిని ఇంటికి వెళ్లి కలిశారు. మరికొందరు కాంగ్రెస్ మాజీ మంత్రులకు కూడా ఆహ్వానం పలుకుతున్నారు. ఈ దిశగా విజయవంతమైతే జగన్‌ స్టామినాతో పాటు ఒక మంచి టీం కూడా వైసీపీకి ఉందన్న నమ్మకం జనంలో కలిగే అవకాశం ఉంటుంది.

Click on Image to Read –

Tags:    
Advertisement

Similar News