వలస రాజులకు "తెంటు" కష్టాలు

పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి కేడర్‌ను కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డ నేతలకు వారి పార్టీ అధికారంలోకి వస్తే ఎన్నో ఆశలుంటాయి. పదేళ్ల కష్టానికి ఈఐదేళ్లలో ఫలితం ఉంటుందని భావిస్తారు. కానీ ఇది వరకు పదేళ్లు అధికారం చేలాయించిన వారే… తిరిగి ఫిరాయింపు పీట్లు వేసి అధికార పార్టీలోకి  చొరబడితే?. ఆల్‌ రెడీ అక్కడ ఉన్న వారికి మండుతుంది. ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ అదే జరుగుతోంది. పెద్దమనుషులుగా పేరున్న బొబ్బిలి రాజులు సుజయ్‌ కృష్ణరంగారావు కూడా ఇటీవల […]

Advertisement
Update: 2016-07-12 23:56 GMT

పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి కేడర్‌ను కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డ నేతలకు వారి పార్టీ అధికారంలోకి వస్తే ఎన్నో ఆశలుంటాయి. పదేళ్ల కష్టానికి ఈఐదేళ్లలో ఫలితం ఉంటుందని భావిస్తారు. కానీ ఇది వరకు పదేళ్లు అధికారం చేలాయించిన వారే… తిరిగి ఫిరాయింపు పీట్లు వేసి అధికార పార్టీలోకి చొరబడితే?. ఆల్‌ రెడీ అక్కడ ఉన్న వారికి మండుతుంది. ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ అదే జరుగుతోంది. పెద్దమనుషులుగా పేరున్న బొబ్బిలి రాజులు సుజయ్‌ కృష్ణరంగారావు కూడా ఇటీవల టీడీపీలోకి ఫిరాయించేశారు. అయితే 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి సుజయ్ కృష్ణ రంగరావు చేతిలో ఓడిపోయిన తెంటు లక్ష్మునాయుడు వర్గం ఇప్పుడు రాజులపై దండెత్తుతోంది.

పార్టీకి వలసొచ్చిన రాజులు సైలెంట్‌గా ఉండకుండా జన్మభూమి కమిటీలు, లబ్దిదారుల ఎంపిక, రేషన్ డీలర్లు, కాంట్రాక్టులు ఇలా అన్ని తాము చెప్పిన వారికే ఇవ్వాలని హుకుం జారీ చేస్తోందన్నది తెంటు వర్గం ఆరోపణ. దీంతో తెంటు వర్గం రగిలిపోతోంది. త్వరలోనే సుజయ్ కృష్ణరంగారావుకు వ్యతిరేకంగా టీడీపీ నియోజకవర్గ నేతలంతా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇకపై సుజయ్‌ కృష్ణపై నేరుగానే విమర్శలు ఎక్కుపెట్టేందుకు తెంటు వర్గం సిద్ధమైంది. సుజయ్‌ కృష్ణ హయంలో జరిగిన అవకతకలు, అక్రమాల చిట్టాను తయారు చేస్తున్నారు.

నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారానని సుజయ్ కృష్ణ చెబుతున్నా… పార్టీ మారడానికి గల అసలు కారణాన్ని జనంలోకి తీసుకెళ్లి పెద్దమనుషుల అసలు రూపాన్ని బయటపెడుతామని తెంటు లక్ష్మునాయుడు వర్గం చెబుతోంది. తాము పదేళ్లు ప్రతిపక్షంలో పార్టీ కోసం పడ్డ కష్టం జిల్లావాసులందరికీ తెలుసని… కానీ తీరా పార్టీ అధికారంలోకి వచ్చాక అధికారం కోసం ఫిరాయించిన సుజయ్‌ కృష్ణ తిరిగి పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకునేది లేదంటున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే బొబ్బిలి రాజుల పెద్దమనిషితత్వాన్ని ప్రజలే నిర్ణయిస్తారంటూ తెంటు వర్గం సవాల్ చేస్తోంది. త్వరలోనే తెంటు వర్గం బహిరంగంగా తిరుగుబావుట ఎగరవేయనుందని చెబుతున్నారు.

Click on Image to Read –

Tags:    
Advertisement

Similar News