చంద్రబాబును లెక్కచేయని నేతలు

ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతో మొన్నటి ఎన్నికల సమయంలో చంద్రబాబు కులాల వారీగా వాగ్దానాలు చేశారు. బోయలను ఎస్టీల్లో చేరుస్తామన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తున్నామన్నారు. ఇప్పుడా హామీలే ఏపీలో కులాల పోరును రాజేస్తున్నాయి. కాపు ఉద్యమం చల్లారక ముందే బీసీ ఉద్యమం మొదలవుతోంది. కాపులను బీసీల్లో చేరిస్తే సహించేది లేదంటూ బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే బీసీ ఉద్యమానికి టీడీపీ నేతలే సహకారం అందించడం. బీసీల్లోకి కాపులను చేర్చవద్దంటూ డిప్యూటీ […]

Advertisement
Update: 2016-07-10 02:10 GMT

ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతో మొన్నటి ఎన్నికల సమయంలో చంద్రబాబు కులాల వారీగా వాగ్దానాలు చేశారు. బోయలను ఎస్టీల్లో చేరుస్తామన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తున్నామన్నారు. ఇప్పుడా హామీలే ఏపీలో కులాల పోరును రాజేస్తున్నాయి. కాపు ఉద్యమం చల్లారక ముందే బీసీ ఉద్యమం మొదలవుతోంది. కాపులను బీసీల్లో చేరిస్తే సహించేది లేదంటూ బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే బీసీ ఉద్యమానికి టీడీపీ నేతలే సహకారం అందించడం. బీసీల్లోకి కాపులను చేర్చవద్దంటూ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్‌ భారీ ర్యాలీ నిర్వహించారు. ధర్నా చేశారు. అప్పట్లో సోదరుడి తీరును డిప్యూటీ సీఎం బహిరంగంగా తప్పుపట్టినా… ఆయన కూడా బీసీ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు. అది మరవక ముందే తాజాగా విజయవాడలో ఏర్పాటయిన మంజునాథ కమిషన్‌ కార్యాలయం ముందు బీసీ సంఘాలు వేలాది మందితో భారీ ధర్నా చేశాయి.

ఈ ధర్నాకు వచ్చినవారంతా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. ధర్నాకు బీసీలను తరలించింది స్వయానా టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట్ కావడం టీడీపీ నేతలకు మింగుడుపడడంలేదు. ఈ ధర్నాకు పితానితో పాటు టీడీపీలోని కొందరు కీలకమైన బీసీ నేతల సహకారం ఉందని చెబుతున్నారు. కాపులను బీసీల్లోకి చేరిస్తే విద్యాఉద్యోగాల్లో కన్నా రాజకీయంగానే బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతుందన్నది బీసీ నేతల భయంగా కనిపిస్తోంది.

రిజర్వేషన్లు ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను మొత్తం కాపు, బలిజ లాంటి జనాభా ఎక్కువున్న వర్గాలే కొల్లగొడుతాయని బీసీ నేతలు చెబుతున్నారు. దాని వల్ల స్థానిక సంస్థల్లో బీసీ కోటా మొత్తం కాపు కోటాగా మారిపోతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ కారణంగానే టీడీపీలోని కీలక బీసీ నేతలంతా తెరవెనుక నుంచి బీసీ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు. కేఈ ధర్నా, పితాని కుమారుడు మంజునాథ కమిషన్ కార్యాలయం ముందు ధర్నాకు జనాన్ని తరలించడం వంటివన్నీ అధికార పార్టీ నేతల సహకారం ఉండబట్టే జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ పరిస్థితిని చంద్రబాబు కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారని చెబుతున్నారు. ఒకవేళ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎగ్గొట్టాల్సి వస్తే బీసీ ఉద్యమం కూడా ఒకింత మంచి చేస్తుందన్న భావనలోనూ టీడీపీ నాయకత్వం ఉన్నట్టు చెబుతున్నారు.

click on image to read-

Tags:    
Advertisement

Similar News