మేం చెప్పిన వారే వెళ్లాలి.. బాబు బినామీ నేతలకు "షా" షాక్

ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబు వర్గానికి కలవరపాటుకు గురిచేసేలా ఉన్నాయి. ఇంతకాలం తన వర్గానికే చెందిన హరిబాబు అధ్యక్షుడిగా ఉండడంతో ఏపీ బీజేపీపై చంద్రబాబుకు గట్టి పట్టు ఉండేది, పైగా ఢిల్లీలో వెంకయ్య ఉండడంతో ఏపీ బీజేపీ… టీడీపీ బ్రాంచ్‌ ఆఫీస్ అన్న భావన ఏర్పడింది. ఈ పరిస్థితిని బీజేపీలోని మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ఏపీ బీజేపీ ఇలా రెండు వర్గాలుగా చీలిపోవడం వల్లే నూతన అధ్యక్షుడి అంశం కూడా ఆలస్యం అవుతోంది. […]

Advertisement
Update: 2016-07-09 23:40 GMT

ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబు వర్గానికి కలవరపాటుకు గురిచేసేలా ఉన్నాయి. ఇంతకాలం తన వర్గానికే చెందిన హరిబాబు అధ్యక్షుడిగా ఉండడంతో ఏపీ బీజేపీపై చంద్రబాబుకు గట్టి పట్టు ఉండేది, పైగా ఢిల్లీలో వెంకయ్య ఉండడంతో ఏపీ బీజేపీ… టీడీపీ బ్రాంచ్‌ ఆఫీస్ అన్న భావన ఏర్పడింది. ఈ పరిస్థితిని బీజేపీలోని మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ఏపీ బీజేపీ ఇలా రెండు వర్గాలుగా చీలిపోవడం వల్లే నూతన అధ్యక్షుడి అంశం కూడా ఆలస్యం అవుతోంది.

ఎలాగైనా చంద్రబాబుకు అనుకూలంగా పనిచేసే వ్యక్తినే తిరిగి అధ్యక్షుడిగా నియమించాలని వెంకయ్యనాయుడు, హరిబాబుతో పాటు మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలొస్తున్నాయి. అయితే బీజేపీ సొంతంగా ఎదగాలని భావిస్తున్న మరోవర్గం మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. ఈనేపథ్యంలో శనివారం అమిత్‌షాలో రాష్ట్ర నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు .. కొందరు నేతలు పార్టీని వదిలేసి చంద్రబాబుతో, టీడీపీతో నేరుగా చర్చలు జరుపుకుంటున్నారని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ బీజేపీని చంద్రబాబుకు తాకట్టుపెట్టారన్న భావన దీని వల్ల కలుగుతోందని వాపోయారు. దీనిపై అమిత్‌షా సీరియస్‌గానే స్పందించారు.

ఇకపై ఏ నేత కూడా నేరుగా టీడీపీతో చర్చలు జరపడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. టీడీపీతో ఏ అంశాలపైన అయినా చర్చలు జరపాల్సి వస్తే తాము సూచించిన వ్యక్తులే అందుకు పనిచేయాలని స్పష్టం చేశారు. ఇకపై బీజేపీ తరపున జరిగే అన్ని చర్చలకు ఢిల్లీ నాయకత్వమే పేర్లను సూచిస్తుందని చెప్పారు. కాదని ఎవరైనా ఇష్టానుసారం పనిచేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని షా వార్నింగ్ ఇచ్చారు.

click on image to read-

Tags:    
Advertisement

Similar News