ఫిరాయింపు ఎమ్మెల్యేను ద్వేషించిన సొంత తల్లి

ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి తీరును ఆయన తల్లి కూడా తప్పుపట్టారు. తన కుమారుడు చేసిన పనిని తల్లిగా తాను కూడా సహించలేకపోతున్నానని ఆమె చెప్పారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో బుడ్డా తల్లితో పాటు ఆయన సోదరుడు బుడ్డా శేషారెడ్డి, ఇతర కుటుంబసభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడిన బుడ్డా తల్లి ఓబులమ్మ.. జగన్ తన కొడుకుని నమ్మి టికెట్‌ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి ఇలా పార్టీ మారడడం […]

Advertisement
Update: 2016-07-09 00:07 GMT

ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి తీరును ఆయన తల్లి కూడా తప్పుపట్టారు. తన కుమారుడు చేసిన పనిని తల్లిగా తాను కూడా సహించలేకపోతున్నానని ఆమె చెప్పారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో బుడ్డా తల్లితో పాటు ఆయన సోదరుడు బుడ్డా శేషారెడ్డి, ఇతర కుటుంబసభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడిన బుడ్డా తల్లి ఓబులమ్మ.. జగన్ తన కొడుకుని నమ్మి టికెట్‌ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి ఇలా పార్టీ మారడడం తనను చలా బాధించిందన్నారు.

తన కుమారుడు డబ్బులకు అమ్ముడుపోయాడని జనం మాట్లాడుకుంటుంటే తల్లిగా మానసిక వేధనకు గురయ్యానని ఓబులమ్మ చెప్పారు. తన పెద్ద కుమారుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి పార్టీ ఫిరాయించి తప్పు చేసినా… తన చిన్న కుమారుడు బుడ్డా శేషారెడ్డిని శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా జగన్ నియమించడం సంతోషం కలిగించిందన్నారు. జగన్‌కు తమ కుటుంబంపై ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనంగా భావిస్తున్నట్టు చెప్పారు. అందుకే తమ కుటుంబానికి చెందిన మూడు తరాల వారందరం కలిసి జగన్ కుటుంబం వెంటే ఉంటామని ఓబులమ్మ చెప్పారు. తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా తన సోదరుడు రాజశేఖర్ రెడ్డి పార్టీ ఫిరాయించడాన్ని తట్టుకోలేకపోతున్నాన‌ని బుడ్డా శేషారెడ్డి అన్నారు. సొంతతల్లి చేతిలోనే తిరస్కరణకు గురైన తర్వాత చేసే రాజకీయానికి ఇక విలువేముంటుంది?

click on image to read-

Tags:    
Advertisement

Similar News