చెవిరెడ్డిని మళ్లీ లాక్కెళ్లిన పోలీసులు

సీఎం సొంతజిల్లా చిత్తూరు పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. ప్రజాసమస్యలపై నిరసన తెలిపిన ఎమ్మెల్యేలను కూడా పదేపదే అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. రెండు రోజుల నుంచి చెవిరెడ్డిని పోలీసులు వరుసపెట్టి అరెస్ట్‌లు చేస్తున్నారు. మొన్న వైసీపీ కార్యకర్త ఇంటిని కూల్చడాన్ని నిరసిస్తూ సబ్‌ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో వెంటనే బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇంతలోనే 2013లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ గురువారం రాత్రి ముగ్గురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, […]

Advertisement
Update: 2016-07-09 01:33 GMT

సీఎం సొంతజిల్లా చిత్తూరు పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. ప్రజాసమస్యలపై నిరసన తెలిపిన ఎమ్మెల్యేలను కూడా పదేపదే అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. రెండు రోజుల నుంచి చెవిరెడ్డిని పోలీసులు వరుసపెట్టి అరెస్ట్‌లు చేస్తున్నారు. మొన్న వైసీపీ కార్యకర్త ఇంటిని కూల్చడాన్ని నిరసిస్తూ సబ్‌ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో వెంటనే బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇంతలోనే 2013లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ గురువారం రాత్రి ముగ్గురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, దాదాపు వంద మంది పోలీసులు వచ్చి చెవిరెడ్డిని అర్థరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. పుత్తూరు కోర్టు 15రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులోనూ బెయిల్ రావడంతో శనివారం ఉదయం ఆయన చిత్తూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. అయితే అప్పటికే అక్కడ మాటువేసిన ఎంఆర్ పల్లి పోలీసులు … చెవిరెడ్డి తన అనుచరులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి చొరబడ్డారంటూ మరో కేసులో జత చేసి అరెస్ట్ చేశారు. ఈ సమయంలో వైసీపీ కార్యకర్తలు ప్రతిఘటించగా వారందని తోసేసి చెవిరెడ్డిని బలవతంగా లాక్కెళ్లారు. ప్రజసమస్యలపై నిరసన తెలిపిన ఎమ్మెల్యేలను ఇలా పగబట్టినట్టు పోలీసులు వెంటాడి రెండు రోజుల్లోనే మూడుసార్లు అరెస్ట్ చేయడంపై న్యాయనిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు. సొంత జిల్లాలో తనకు బాగా కావాల్సిన పోలీసు అధికారులను నియమించుకున్న చంద్రబాబు వారి చేత టీడీపీ కార్యకర్తల తరహాలో పనిచేయించుకుంటున్నారన్న విమర్శలూ వస్తున్నాయి.. అయినా చంద్రబాబు ఏదీ చేసినా అన్ని వ్యవస్థలు కళ్లు మూసుకుని ఉండాల్సిందే. ఆయనకు ఎదురించి న్యాయం, ధర్మం నిలవడగా సాధ్యమా?. న్యాయం మీద ఆయనుకున్న ప్రత్యేక పట్టు అలాంటిది మరీ .

click on image to read-


Tags:    
Advertisement

Similar News