యూఎస్‌లోనూ తెగులు... ముద్దలో మట్టేసుకుంటున్న తెలుగు వారు

అమెరికా వెళ్లే వారిలో చాలా మంది డబ్బు కోసమే వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లి డబ్బులు బాగా సంపాదించేశాక ఏమి చేయలో దిక్కుతోచక కొందరు కులాల కుంపట్లను రగిలించుకుంటున్నారు. దేశం కాని దేశంలో ఒక్కటిగా ఉండాల్సిందిపోయి వర్గాల వారీగా చీలిపోయారు. ఒకరు తానా అంటుంటే మరొకరు ఆటా అంటున్నారు. తానా ఒక వర్గానికి, ఒక పార్టీకి వంతపాడుతుంటే ఆటాలో మరికొన్ని వర్గాలు చేపి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ముక్కలై ముచ్చట్టు పెట్టుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. […]

Advertisement
Update: 2016-07-09 12:05 GMT

అమెరికా వెళ్లే వారిలో చాలా మంది డబ్బు కోసమే వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లి డబ్బులు బాగా సంపాదించేశాక ఏమి చేయలో దిక్కుతోచక కొందరు కులాల కుంపట్లను రగిలించుకుంటున్నారు. దేశం కాని దేశంలో ఒక్కటిగా ఉండాల్సిందిపోయి వర్గాల వారీగా చీలిపోయారు. ఒకరు తానా అంటుంటే మరొకరు ఆటా అంటున్నారు. తానా ఒక వర్గానికి, ఒక పార్టీకి వంతపాడుతుంటే ఆటాలో మరికొన్ని వర్గాలు చేపి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

ముక్కలై ముచ్చట్టు పెట్టుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆ స్థాయి దాటిపోయారు. వలసెళ్లిన మన తెలుగువారు కుట్రలు పన్నుకుంటున్నారు. . ఇందుకు ఉదాహరణగా కొత్త ”ఆటా” ఈవెంట్‌పై అమెరికా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు దాడి చేయడేమనని చెబుతున్నారు. ఇటీవల డెట్రాయిట్‌లో కొత్త ఆటా వారు సంబరాలు చేసుకుంటున్న సమయంలోనే ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు దాడి చేశారు. ఆహారం చల్లబడిందంటూ మొత్తం ఫుడ్‌ను సీజ్‌ చేసేశారు. తీరా భోజనాలు వడ్డించే సమయంలో జరిగిన ఈపరిణామంతో నిర్వాహకులు కంగుతిన్నారు. అప్పటికే వచ్చిన అతిథులు ఆకలితో అలమటించారు. అప్పటికప్పుడు పిజ్జాలు తెచ్చి చిన్నారులకు పెట్టి సరిపెట్టారు. పెద్దవాళ్లు చేసేది లేక భోజనం చేయకుండానే వెళ్లిపోయారు.

అయితే ఇలాంటి ఈవెంట్లలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు దాడులు చేయడం ఉండదని నిర్వహకులు చెబుతున్నారు. ఎవరో కావాలనే ఫిర్యాదు చేసి వారిని ఇక్కడికి పంపించారని అనుమానంవ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఈవెంట్ విజయవంతం కాకుండా చేసే కుట్ర ఇందులో ఉందంటున్నారు. జులై 1 నుంచి మూడు రోజుల పాటు జరిగిన ఆటా ఈవెంట్ కు ఒక పార్టీ ముద్ర వేసేలా తెలుగుగడ్డపై నుంచి నడుస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు కూడా కథనాలు ప్రసారం చేశాయి.

తాజా ఆటా ఉత్సవాల ఫుడ్ పై నిజంగా ఫుడ్ ఇన్ స్పెక్టర్లకు మరొకరు ఫిర్యాదు చేశారో లేదో గానీ… ఈ ఆరోపణలను బట్టే అమెరికాలో మన తెలుగువాళ్లు ఎలా బతుకుతున్నారో అర్థమవుతుంది. అమెరికా లాంటి దేశాలకు వెళ్లి కూడా కులాలు, వర్గాలు, పార్టీలు అన్న తెగులుతోనే బతుకుతున్నారంటే ఏమనాలి.

click on image to read-

Tags:    
Advertisement

Similar News