ఎట్టకేలకు కలను నిజం చేసుకున్నాడు.

50కోట్ల క్లబ్. నితిన్ కల ఇది. అసలు దీన్ని అందుకుంటానని అతడు కలలో కూడా ఊహించి ఉండడు. ఎందుకంటే.. చాలామంది హీరోలు ఇంకా 40కోట్ల క్లబ్ లోకి కూడా చేరలేదు. అలాంటిది తను 50కోట్ల క్లబ్ గురించి ఆశపడ్డం అత్యాశే అవుతుందని నితిన్ కు తెలుసు. కానీ సినీలోకంలో ఏదైనా జరగవచ్చు. గుర్రాం ఎగరావచ్చు అనే సామెతను నిజం చేస్తూ… అ..ఆ సినిమాతో ఊహించని విజయం సొంతం చేసుకున్నాడు నితిన్. కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా […]

Advertisement
Update: 2016-07-07 03:29 GMT

50కోట్ల క్లబ్. నితిన్ కల ఇది. అసలు దీన్ని అందుకుంటానని అతడు కలలో కూడా ఊహించి ఉండడు. ఎందుకంటే.. చాలామంది హీరోలు ఇంకా 40కోట్ల క్లబ్ లోకి కూడా చేరలేదు. అలాంటిది తను 50కోట్ల క్లబ్ గురించి ఆశపడ్డం అత్యాశే అవుతుందని నితిన్ కు తెలుసు. కానీ సినీలోకంలో ఏదైనా జరగవచ్చు. గుర్రాం ఎగరావచ్చు అనే సామెతను నిజం చేస్తూ… అ..ఆ సినిమాతో ఊహించని విజయం సొంతం చేసుకున్నాడు నితిన్. కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమాతో నెరవేరదనుకున్న తన కలను కూడా నెరవేర్చుకున్నాడు. అవును.. అ..ఆ సినిమా తాజాగా 50కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. జూన్ 2న విడుదలైన ఈ సినిమా ఏమాత్రం తగ్గకుండా స్టడీగా వసూళ్లు రాబట్టి.. అంతిమంగా 50కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ఓవర్సీస్ లో 2.5 మిలియన్ డాలర్లు కొల్లగొట్టడం ఈ సినిమాకు కలిసొచ్చింది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సెల్యులాయిడ్ లో నితిన్ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. అన్ని పాత్రలు పండడంతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరవ్వడంతో సినిమా సూపర్ హిట్ అయింది.

Tags:    
Advertisement

Similar News