మోదీ మోదేశారు బాబోయ్!... బావురుమన్న ఏపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు

వర్షాకాలంలో వానలొస్తాయి కదాని… ఎండకాలం కుండలో నీరు కింద పోసుకున్నాడట వెనుకటికి ఒకాయన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విచ్చవిడిగా టీడీపీలోకి ఫిరాయించేసిన వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. వచ్చే ఎన్నికల్లో నియోజవర్గాల సంఖ్య భారీగా పెరుగుతుందంటూ వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించేలా చంద్రబాబు చేశారు. అసలు నిజంగా నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందా లేకుంటే బాబు చేతిలో తాము బకరాలు అవుతున్నామా అన్న అనుమానం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కలిగిన ప్రతిసారీ తన మిత్రుడు వెంకయ్యనాయుడుతో చంద్రబాబు ధైర్యం నూరిపోయించారు. […]

Advertisement
Update: 2016-07-07 09:21 GMT

వర్షాకాలంలో వానలొస్తాయి కదాని… ఎండకాలం కుండలో నీరు కింద పోసుకున్నాడట వెనుకటికి ఒకాయన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విచ్చవిడిగా టీడీపీలోకి ఫిరాయించేసిన వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. వచ్చే ఎన్నికల్లో నియోజవర్గాల సంఖ్య భారీగా పెరుగుతుందంటూ వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించేలా చంద్రబాబు చేశారు. అసలు నిజంగా నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందా లేకుంటే బాబు చేతిలో తాము బకరాలు అవుతున్నామా అన్న అనుమానం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కలిగిన ప్రతిసారీ తన మిత్రుడు వెంకయ్యనాయుడుతో చంద్రబాబు ధైర్యం నూరిపోయించారు. చంద్రబాబు చెవిలో చెప్పడం తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు కోసం ప్రయత్నిస్తున్నామని వెంకయ్య చెప్పడం కామన్‌గా జరుగుతూ వచ్చింది.

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో వెంకయ్య ఆ మాటలు చెప్పేసరికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి రొమ్ములు విరుచుకుని తిరిగేవారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. కేంద్రంలో మంత్రుల శాఖలను మోదీ మార్చేసే సరికి ఇక్కడి ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెల్లో గునపాలు దిగినంత పనైపోయింది. కిందమీదపడైనా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు నియోజకవర్గాల పెంపుకు పార్లమెంట్‌లో ఆమోద ముద్రవేయిస్తారని ఫిరాయింపుదారులు ఆశగా ఎదురుచూశారు. కానీ వెంకయ్య చేతి నుంచి కీలకమైన పార్లమెంట్ వ్యవహారాలను మోదీ తొలగించేశారు. సో ఇప్పుడు నియోజకవర్గాల పెంపు అంశం వెంకయ్య చేతుల్లో లేకుండాపోయింది. దీంతో ఇప్పుడు తమకు దిక్కెవరని సదరు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.

ఫిరాయింపు సమయంలో ముట్టిన సొమ్ముతో జీవితాన్ని సర్దేసుకుందామనుకుంటున్న ఎమ్మెల్యేలు పెద్దగా ఫీల్ అవడం లేదు గానీ… వంశాల రాజకీయ చరిత్ర గురించి మాట్లాడే నేతలు మాత్రం తెగ ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే పాత టీడీపీ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ఆదినారాయణరెడ్డి, భూమా నాగిరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, అశోక్ రెడ్డి, భూమా అఖిలప్రియ, కదిరి అత్తార్‌ చాంద్‌ బాషా, జ్యోతుల నెహ్రు తదితరుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పుడు ఫిరాయింపుదారుల ముందు రెండే మార్గాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఒకటి తమ రాకకంటే ముందే నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేతలతో నేరుగా పోరు చేసి వారిని బయటకి పంపించడం లేదంటే తమ రాజకీయ జీవితం చరమాంకానికి చేరుకుందిలే అని సర్దుకుపోవడం. మొత్తం మీద వెంకయ్యబాబును నమ్ముకుని ఫిరాయింపు ఎమ్మెల్యేలు నట్టేట ముగినట్టుగా ఉన్నారు. అంతే మరీ.. చట్టాలు, నీతి నియమాలు గట్టుమీద పెట్టి ఇదే రాజకీయం అంటే ఎదురయ్యే రాజకీయం కూడా ఇలాగే ఉంటుంది.

click on image to read-

Tags:    
Advertisement

Similar News