సింధుతాయ్ కి ఊరట

చివరకు అనాథ బాలల పాలిటి మాతృమూర్తి సింధుతాయ్ కి ఊరట లభించింది. ఆమెకు అండగా ఉండడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి సంసిద్ధులయ్యారు. సింధుతాయ్ సప్కాల్ నడుపుతున్న అనాథశరణాలయాలకు అనుమతి మంజూరు చేయాలని అధికారులను ఆదేశించినట్టు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలియజేశారు. రచయిత్రి, పత్రికా రచయిత అయిన సుచేతా దలాల్ ఇరవై వేలకన్నా ఎక్కువ మంది సంతకాలు సేకరించి ఫడ్నవీస్ కు విజ్ఞాపన పత్రం  పంపిన కొద్ది సేపటికే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సుచేతా దలాల్ కు ఫోన్ చేసి […]

Advertisement
Update: 2016-07-06 00:37 GMT

చివరకు అనాథ బాలల పాలిటి మాతృమూర్తి సింధుతాయ్ కి ఊరట లభించింది. ఆమెకు అండగా ఉండడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి సంసిద్ధులయ్యారు. సింధుతాయ్ సప్కాల్ నడుపుతున్న అనాథశరణాలయాలకు అనుమతి మంజూరు చేయాలని అధికారులను ఆదేశించినట్టు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలియజేశారు.

రచయిత్రి, పత్రికా రచయిత అయిన సుచేతా దలాల్ ఇరవై వేలకన్నా ఎక్కువ మంది సంతకాలు సేకరించి ఫడ్నవీస్ కు విజ్ఞాపన పత్రం పంపిన కొద్ది సేపటికే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సుచేతా దలాల్ కు ఫోన్ చేసి సింధుతాయ్ వివరాలు అడిగారు. ఆ తర్వాత సుచేతా దలాల్ ఈ విజ్ఞాపన పత్రం ఫడ్నీవస్ భార్యకు పంపించారు. ఆమె ముఖ్యమంత్రికి నచ్చచెప్తానని హామీ ఇచ్చారు. ఈ లోగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో మాట్లాడతానని చెప్పారు.

ఎలాంటి లాభం లేకుండా మానవ సేవ చేస్తున్న వారికి సహాయ పడడానికి ప్రభుత్వం వెంటనే స్పందించడం సంతోషకరమైన అంశం.

 

Tags:    
Advertisement

Similar News