పట్టిసీమ చెల్లెమ్మకు నేడు మళ్లీ పెళ్లి

పట్టిసీమ ప్రాజెక్ట్ భలే కామెడీగా తయారైంది. “చెల్లికి జరగాలి మళ్లీ మళ్లీ పెళ్లి” అన్నట్టుగా పట్టిసీమ ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. కొన్ని నెలల క్రితమే అనుకున్న సమయానికి పట్టిసీమ పూర్తి చేశామంటూ గతేడాది ఆగస్టు 14న చంద్రబాబు, దేవినేని ఉమా తెగ హడావుడి చేసి ప్రాజెక్టును ప్రారంభించారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని చిందులు తొక్కుతూ కృష్ణమ్మను, గోదావరమ్మను మా బాబు కలిపేశారంటూ ఎర్రటి నీళ్లలో జలకాలాడారు. క్వింటాళ్ల కొద్ది పూలు తెచ్చి నదికి సమర్పించారు. ఇక ఎలాగో […]

Advertisement
Update: 2016-07-06 00:25 GMT

పట్టిసీమ ప్రాజెక్ట్ భలే కామెడీగా తయారైంది. “చెల్లికి జరగాలి మళ్లీ మళ్లీ పెళ్లి” అన్నట్టుగా పట్టిసీమ ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. కొన్ని నెలల క్రితమే అనుకున్న సమయానికి పట్టిసీమ పూర్తి చేశామంటూ గతేడాది ఆగస్టు 14న చంద్రబాబు, దేవినేని ఉమా తెగ హడావుడి చేసి ప్రాజెక్టును ప్రారంభించారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని చిందులు తొక్కుతూ కృష్ణమ్మను, గోదావరమ్మను మా బాబు కలిపేశారంటూ ఎర్రటి నీళ్లలో జలకాలాడారు. క్వింటాళ్ల కొద్ది పూలు తెచ్చి నదికి సమర్పించారు. ఇక ఎలాగో బాబు మీడియా భజన చెప్పనక్కర్లేదు. తప్పిపోయిన గోదావరిని కృష్ణమ్మ చెంతకు చంద్రబాబు వెతికి తెచ్చినట్టు ”కృష్ణమ్మ ఒడికి గోదావరమ్మ” అంటూ హెడ్ లైన్లు పెట్టి తెగ హడావుడి చేశారు. జనం కూడా నమ్మేశారు (తొలి ప్రారంభోత్సవం అప్పుడు పట్టిసీమకు రాయలసీమలోని హంద్రీనీవా మోటర్లను ఎత్తువెళ్లి అమర్చింది చంద్రబాబు ప్రభుత్వం) . సీన్ కట్‌ చేస్తే..

పట్టిసీమ చెల్లెమ్మ ఉత్సవాన్ని నేడు మరోసారి ఘనంగా చంద్రబాబు ప్రారంభించనున్నారు. నేడు పట్టిసీమ పంపుల మీట నొక్కి నీటిని చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఎప్పటిలాగే చంద్రబాబు పత్రికలు రెండు పతాకశీర్షికలతో ఈ ఘనకార్యాన్ని అచ్చేశాయి. సరే ఈసారి భజంత్రీలైనా ఆఖరి సారి అనుకుంటే పొరపాటే.

చంద్రబాబు ఇష్టమైన రెండు పత్రికలు రాసిన కథనాలే ఈ సారి ప్రారంభోత్సవం కూడా తాత్కాలికమేనని తేల్చేశాయి. ఎందుకంటే చంద్రబాబు అన్ని పంపుసెట్ల నుంచి నీటిని విడుదల చేసినా అది కాసేపేనని చంద్రబాబు పెద్దపత్రిక రాసింది. ప్రారంభోత్సవం అయిపోగానే పంపులను ఆపేస్తారట. కారణం. రామిలేరు వద్ద ఇంకా పనులు పూర్తి కాలేదట. కాబట్టి నీరు అక్కడినుంచి ముందుకుకెళ్లే మార్గం లేదు. సరే రామిలేరువద్ద ఏదైనా రిజర్వాయర్ ఉందా అంటే అది లేదు. దీని బట్టే తెలిసిపోతోంది పట్టిసీమ మలివిడత ప్రారంభోత్సవం కూడా ఉత్సవం కోసమే, ప్రచారం కోసమే. జనానికి ఏదో చేసేస్తున్నామని చెప్పుకోవడానికే. మళ్లీ టీడీపీ నేతలు బురదనీటిలో మునిగి పాటేసుకోవడానికే. సో… పట్టిసీమ చెల్లెమ్మకు జరుగుతుంది మళ్లీ పెళ్లి. ఇదేకాదు ఆఖరి పెళ్లి.

రాజకీయాల్లో చంద్రబాబుది ఎప్పుడూ కొత్త ధోరణే. అందుకే ఆయన అంటుంటాడు “దేశానికే మనం ఆదర్శం” అని, “అందరూ మనల్ని అనుసరిస్తుంటారు” అని. ఆయన అనేది నిజం. ఏ రాజకీయ నాయకుడైనా ఒక ప్రాజెక్టును ఒకేసారి ప్రారంభిస్తాడు. చంద్రబాబు రూటే వేరు. ఒక్కో ప్రాజెక్టుకు నాలుగైదు సార్లు ప్రారంభోత్సవం చేయగలడు. అమరావతికి కూడా రెండుమూడు సార్లు శంఖుస్థాపన చేయడం ఆయనకే సాధ్యం. అమరావతిలో సెక్రెటేరియేట్ ప్రారంభోత్సవం కూడా ఇప్పటికే రెండుసార్లు జరిపిన ఘనత ఆయనకే చెందుతుంది. పొగిడే మీడియా ఉంది. పొగడడానికి సబ్జక్ట్ లేదు. అందుకే అప్పుడప్పుడు చంద్రబాబు ఇలా అవకాశాలు కల్పిస్తుంటాడు మీడియాకు. పొలిటీషియన్ల లందు చంద్రబాబు వేరయా…

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News