ఇదో రకం వెన్నుపోటు... బాబోయ్ బుద్దా..!

విజయవాడలో30కి పైగా ఆలయాలతో పాటు గోశాల కూల్చివేత అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. గోశాల కూల్చివేత వెనుక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గోశాల కూల్చివేత వెనుక కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, గోశాల సంఘం అధ్యక్షుడు రఘురామ్ కుమ్మక్కు దాగి ఉందని ఆరోపణలు వస్తున్నాయి. గోశాల అధ్యక్షుడు రఘురామ్‌ కూల్చివేతకు ఏమాత్రం అభ్యంతరం చెప్పకపోగా… కేశినేని నాని, బుద్ధా వెంకన్నతో కలిసి ప్రెస్‌మీట్ పెట్టడంతో కుమ్మక్కు అనుమానాలకు మరింత బలం చేకూరింది. నిజానికి గోశాలకు […]

Advertisement
Update: 2016-07-04 21:22 GMT

విజయవాడలో30కి పైగా ఆలయాలతో పాటు గోశాల కూల్చివేత అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. గోశాల కూల్చివేత వెనుక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గోశాల కూల్చివేత వెనుక కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, గోశాల సంఘం అధ్యక్షుడు రఘురామ్ కుమ్మక్కు దాగి ఉందని ఆరోపణలు వస్తున్నాయి. గోశాల అధ్యక్షుడు రఘురామ్‌ కూల్చివేతకు ఏమాత్రం అభ్యంతరం చెప్పకపోగా… కేశినేని నాని, బుద్ధా వెంకన్నతో కలిసి ప్రెస్‌మీట్ పెట్టడంతో కుమ్మక్కు అనుమానాలకు మరింత బలం చేకూరింది.

నిజానికి గోశాలకు ఎదురుగానే బుద్దా వెంకన్నకు చెందిన మూడంతస్తుల భవనం ఉంది. తొలుత గోశాల వైపు 60అడుగులు మాత్రమే కూలుస్తాయని చెప్పిన ప్రభుత్వం… ఆ తర్వాత వంద అడుగుల మేర పూర్తిగా అర్ధరాత్రి కూల్చివేసింది. బుద్దా వెంకన్న ఇంటి వైపు మాత్రం ఒక్క అడుగు కూడా కూల్చలేదు. వెంకన్న ఇంటిని కాపాడేందుకే ఇలా చేశారని భక్తులు ఆరోపిస్తున్నారు. పైగా గోశాలకు వచ్చేనీటి పైపు నుంచే బుద్దా వెంకన్న మూడంతస్తుల భవనానికి కూడా నీటి సరఫరా జరుగుతోంది. ఆ నీటి పంపు కరెంట్ బిల్లు కూడా మొదటి నుంచి గోశాల ఖాతాలోనే వేస్తున్నారని తేలింది.

బుద్ధా వెంకన్న ఇంటి కోసం గోశాల అధ్యక్షుడు రఘురామ్, కేశినేని, బుద్దా వెంకన్నలు కలిసి గోమాతకే వెన్నుపోటు పొడిచారని స్థానికులు మండిపడుతున్నారు. కొద్దికాలం క్రితం గోశాలలో ఒకేసారి 25 ఆవులు చనిపోవడాన్ని కూడా ఈసందర్భంగా చర్చించుకుంటున్నారు. గోశాల కమిటీ అధ్యక్షుడు రఘురామ్‌ … అధికార పార్టీతో కుమ్మక్కు అయిన విషయం తెలుసుకున్న కమిటీ సభ్యులంతా రాజీనామాకు పట్టుపట్టారు. కానీ అధికార పార్టీ అండ ఉన్న రఘురామ్‌… రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చేశారు. బుద్ధా వెంకన్న ఇంటి కోసమే గోశాలను పూర్తిగా కూల్చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. రోడ్డుకు అడ్డమని గోశాలను, దేవాలయాలను కూల్చివేయాల్సి వచ్చిందని టీడీపీ చేస్తున్నా ఆరోపణలను భక్తులు కొట్టివేస్తున్నారు. ఇవి ఎప్పటినుంచో వున్నాయని, వాటి పక్కన రోడ్లు వేసింది తరువాత కాలంలోనని చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News