ఇదే చెబుతున్నాం... శైవక్షేత్రమే నిజమైతే ఒక్క సీటు గెలవవు... జీవితంలో ఎంపీ కావు..

ఆలయాల కూల్చివేతకు నిరసనగా పీఠాధిపతులు హిందూధార్మిక సభను నిర్వహించారు. ఈసభలో పీఠాధిపతులు చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గోమాత కంట కన్నీరు రాష్ట్రానికి అరిష్టమన్నారు. గోశాలను కూల్చి పెద్ద తప్పు చేశారని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అపచారాల వల్లే గోదావరి పుష్కరాల్లో జరగకూడనిది జరిగిందన్నారు… ఇప్పుడు జరగబోయే వాటికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తనను దొంగస్వామి అని టీడీపీ ఎంపీ కేశినేని నాని అనడంపై శివస్వామి తీవ్రంగా స్పందించారు. కేశినేని నాని […]

Advertisement
Update: 2016-07-04 06:46 GMT

ఆలయాల కూల్చివేతకు నిరసనగా పీఠాధిపతులు హిందూధార్మిక సభను నిర్వహించారు. ఈసభలో పీఠాధిపతులు చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గోమాత కంట కన్నీరు రాష్ట్రానికి అరిష్టమన్నారు. గోశాలను కూల్చి పెద్ద తప్పు చేశారని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అపచారాల వల్లే గోదావరి పుష్కరాల్లో జరగకూడనిది జరిగిందన్నారు… ఇప్పుడు జరగబోయే వాటికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.

తనను దొంగస్వామి అని టీడీపీ ఎంపీ కేశినేని నాని అనడంపై శివస్వామి తీవ్రంగా స్పందించారు. కేశినేని నాని పొగరుబట్టి పిచ్చితుగ్లక్‌లాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేశినేని బతుకు అందరికీ తెలుసన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ వెళ్లే టికెట్లను 1000, 2000కు దొంగగా అమ్ముకుని పలు దొంగ మార్గాల్లో డబ్బు సంపాదించి ఎంపీగా గెలిచిన వ్యక్తి కాషాయం ధరించిన తమను గురించి మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. నిజంగా శైవక్షేతం అనేది ఉంటే ఇకపై వీరు ఒక్కసీటు గెలవరు, కేశినేని నాని ఇకపై ఎప్పటికీ ఎంపీగా గెలవరని శాపనార్థం పెట్టారు శివస్వామి. విజయవాడలో ఎలా తిరుగుతావో చూస్తామంటూ కొందరు బెదిరిస్తున్నారని … అలాంటి హెచ్చరికలకు భయపడేవాడిని కాదన్నారు. ప్రాణత్యాగానికైనా సిద్దమన్నారు శివస్వామి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News