వైఎస్‌తో మాట్లాడింది ఒక్క నిమిషమే... ఆదే బతికున్నంత కాలం ఆ కుటుంబంతో ఉండేలా చేస్తోంది..

ఆటా ఉత్సవాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రసంగించారు. ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు వైఎస్‌ను తలుచుకుని కంటతడిపెట్టుకున్నారు. భారత దేశంలో చరిత్ర సృష్టించిన వ్యక్తి వైఎస్ అని అన్నారు. రెండు సార్లు యూపీఏ అధికారంలోకి రావడానికి కారణం వైఎస్సేనని చెప్పారు. ఇందిరా గాంధీ హయాం నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా నామినేషన్‌ తేదీకి రెండు రోజులు ముందు వచ్చేదన్నారు. కానీ 2009 ఎన్నికల్లో గెలిచినా ఓడినా తానే బాధ్యుడనంటూ కాంగ్రెస్ […]

Advertisement
Update: 2016-07-04 01:01 GMT

ఆటా ఉత్సవాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రసంగించారు. ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు వైఎస్‌ను తలుచుకుని కంటతడిపెట్టుకున్నారు. భారత దేశంలో చరిత్ర సృష్టించిన వ్యక్తి వైఎస్ అని అన్నారు. రెండు సార్లు యూపీఏ అధికారంలోకి రావడానికి కారణం వైఎస్సేనని చెప్పారు. ఇందిరా గాంధీ హయాం నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా నామినేషన్‌ తేదీకి రెండు రోజులు ముందు వచ్చేదన్నారు. కానీ 2009 ఎన్నికల్లో గెలిచినా ఓడినా తానే బాధ్యుడనంటూ కాంగ్రెస్ సంప్రదాయలను తిరగరాసిన వ్యక్తి వైఎస్‌ అని గోనె అన్నారు. వైఎస్ అంటే ఇప్పటికీ రాయలసీమ, ఆంధ్రాలో కంటే తెలంగాణలోనే ఎక్కువ మంది అభిమానులున్నారని చెప్పారు.

వైఎస్ ఉన్నప్పుడు వానపాముల్లా దాక్కున్న కొందరు వ్యక్తులు ఇప్పుడు త్రాసుపాముల్లా బుసగొడుతున్నారని రోజా మండిపడ్డారు. వైఎస్‌ మనకు లేరని… ఆయనకుటుంబాన్ని కూడా లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ అభిమానులు ఉన్నంత కాలం వైఎస్‌ కుటుంబాన్నిఎవరూ ఏమీ చేయలేరన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. చిన్నవయసులోనే ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రజల కోసం, తండ్రి ఆశయాల కోసం చిరునవ్వుతో ముందుకెళ్తున్న వ్యక్తి జగన్‌ మోహన్ రెడ్డి అని ఆమె అన్నారు.

తెలుగు చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ముఖ్యమంత్రులు వైఎస్‌, ఎన్టీఆర్ మాత్రమేనని అంబటిరాంబాబు అన్నారు. ఎన్టీఆర్ సొంతపార్టీలో ముఖ్యమంత్రి అయ్యారని… కానీ వైఎస్ అన్ని పరిస్థితులను ఎదురించి కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అని అన్నారు. వైఎస్ రాజకీయం అంటేనే ఒక సాహసం అని అంబటి చెప్పారు. వైఎస్ ఏనాడు కూడా ఎవరి మోచేతి నీరు తాగి బతకలేదన్నారు.

29ఏళ్ల వయసులో తనకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన మహానుభావుడు వైఎస్‌ఆర్‌ అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. ఎన్నికల్లో తాను ఓడిపోయిన తర్వాత ఆనం వర్గంతో చాలా ఇబ్బందులు వచ్చాయన్నారు. ఆ సమయంలోనే ఒకరోజు కలవాల్సిందిగా వైఎస్‌ సమాచారం పంపారని చెప్పారు. వైఎస్ ఏమంటారోనని భయపడుతూ వెళ్లానని కానీ ఒక్క చిరు నవ్వుతో తన భయాన్ని దూరం చేశారని చెప్పారు. నేనున్నా ఏం భయపడవద్దు అంటూ ఒక్క నిమిషమే మాట్లాడారని… కానీ ఆ ఒక్క నిమిషమే జీవితాంతం వైఎస్‌ కుటుంబంతోనే ఉండేలా చేసిందన్నారు. ఇదంతా వైఎస్ చనిపోవడానికి 20 రోజుల ముందే జరిగిందని అనిల్‌ కుమార్ యాదవ్ చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News