"ఆటా"పై బాబు మీడియా అక్కసు..!

విభజించు పాలించే పార్ములాను చంద్రబాబే కాదు… ఆయన మీడియా కూడా బాగానే ఫాలో అవుతోంది. తెలుగువారు అమెరికాలో జరుపుకునే ఆటా ఉత్సవాలకు కూడా రకరకాల రంగులు పూసేందుకు సిద్ధమైంది. చంద్రబాబు కోసం బట్టలు చించుకుని పనిచేసే ఒక టీవీ ఛానల్‌… ఆటా వేడుకలపై బాగానే కడుపు చించుకుంది. వైసీపీ ఎమ్మెల్యేలను ఆటా ఉత్సవాలకు ఆహ్వానించడమే సదరు ఛానల్ కు అభ్యంతరంగా ఉంది. వైసీపీ కష్టకాలంలో ఉంటే 21 మంది ఎమ్మెల్యేలు ఆటా ఉత్సవాలలో పాల్గొనడం ఆశ్చర్యంగా ఉందంటూ […]

Advertisement
Update: 2016-07-01 23:26 GMT

విభజించు పాలించే పార్ములాను చంద్రబాబే కాదు… ఆయన మీడియా కూడా బాగానే ఫాలో అవుతోంది. తెలుగువారు అమెరికాలో జరుపుకునే ఆటా ఉత్సవాలకు కూడా రకరకాల రంగులు పూసేందుకు సిద్ధమైంది. చంద్రబాబు కోసం బట్టలు చించుకుని పనిచేసే ఒక టీవీ ఛానల్‌… ఆటా వేడుకలపై బాగానే కడుపు చించుకుంది. వైసీపీ ఎమ్మెల్యేలను ఆటా ఉత్సవాలకు ఆహ్వానించడమే సదరు ఛానల్ కు అభ్యంతరంగా ఉంది. వైసీపీ కష్టకాలంలో ఉంటే 21 మంది ఎమ్మెల్యేలు ఆటా ఉత్సవాలలో పాల్గొనడం ఆశ్చర్యంగా ఉందంటూ కడుపుమంటను ప్రత్యక్షంగానే బయటపెట్టుకుంది. అసలు జగన్‌కు లేని బాధ ఈ ఛానల్‌కు ఎందుకో మాత్రం ఎవరికీ అంతుచిక్కదు.

ఆటా వేడుకలు వైసీపీ కార్యాలయాన్ని తలపిస్తున్నాయంటూ ఉత్సవాలపైనా అక్కసు వెళ్లగక్కడం ద్వారా అమెరికాలోని తెలుగువారి మధ్య కూడా చిచ్చుపెట్టే ప్రయత్నం చేసింది. అక్కడికి వెళ్లిన వారు ఆటా సంబరాల్లో మునిగితేలుతున్నారు అంటూ కొంచెం వాడకూడని భాషను కూడా వాడింది సదరు ఛానల్‌.

ఈ ఛానల్ కు గతంలో జరిగిన “తానా సభలు” టీడీపీ కార్యాలయాన్ని తలపించివుంటాయి. పసుపుమయమైన తానా సభలను చూసినందువల్లే “ఆటా సభలు” వైసీపీ కార్యాలయంలాగా అనిపించి వుంటాయని విశ్లేషకులు అంటున్నారు.

అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఆటా వేడుకల ఆహ్వానితుల జాబితాలో వెంకయ్యనాయుడు, కేఈ కృష్ణమూర్తి, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, రేవంత్‌ రెడ్డి, సీఎం రమేష్, జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి, గంటా శ్రీనివాస రావు, పల్లె రఘునాథ రెడ్డి, లాంటి టీడీపీ హేమాహేమీలు ఉన్నారు. టీఆర్‌ఎస్ నుంచి కడియం శ్రీహరి, కవిత, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, పి. మహేందర్ రెడ్డి, స్వామిగౌడ్, మధుసూదనాచారి, ఎర్రబెల్లి దయాకర్‌, కొండా విశ్వేశ్వర రెడ్డి, జితేంధర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, రసమయి బాలకిషన్, యాదవ రెడ్డిలతో పాటు మధుయాష్కీ, కె. లక్ష్మన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రామచందర్ రావు, పెద్దిరెడ్డి లాంటి వారు కూడా ఉన్నారు. కానీ చంద్రబాబు టీవీ ఛానల్‌ మాత్రం వైసీపీని టార్గెట్ చేయబోయి ఆటా ఉత్సవాలపైనా పరోక్షంగా బురద చల్లింది. అయితే బహుశా ఆటావేడుకలకు తనను ఆహ్వానించలేదన్న బాధ సదరు ఛానల్‌ యాజమాన్యానికి ఉందేమో!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News