జడ్జిలంటే అంత గౌరవమా!... చంద్రమోహనా...

చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు పవిత్రమైన న్యాయవ్వవస్థ కూడా రోడ్డు మీదకు వచ్చేపరిస్థితి వచ్చింది. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఇంకా పదేళ్ల సమయం ఉన్నా కూడా ఉద్యోగులంతా తరలిపోవాల్సిందేనంటూ రంగులు కూడా వేయని వెలగపూడి భవనాల్లోకి సచివాలయాలన్ని తరలించేసిన చంద్రబాబు… హైకోర్టు విషయానికి వచ్చే సరికి మాత్రం అందుకు భిన్నంగా పాటపాడుతున్నారు. ఒక అడుగు ముందుకేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొత్తవాదన తెరపైకి తెచ్చి అసలు విషయాన్ని ఎల్లో బ్రెయిన్‌ సాయంతో పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేశారు. హైకోర్టు […]

Advertisement
Update: 2016-06-29 23:43 GMT

చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు పవిత్రమైన న్యాయవ్వవస్థ కూడా రోడ్డు మీదకు వచ్చేపరిస్థితి వచ్చింది. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఇంకా పదేళ్ల సమయం ఉన్నా కూడా ఉద్యోగులంతా తరలిపోవాల్సిందేనంటూ రంగులు కూడా వేయని వెలగపూడి భవనాల్లోకి సచివాలయాలన్ని తరలించేసిన చంద్రబాబు… హైకోర్టు విషయానికి వచ్చే సరికి మాత్రం అందుకు భిన్నంగా పాటపాడుతున్నారు. ఒక అడుగు ముందుకేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొత్తవాదన తెరపైకి తెచ్చి అసలు విషయాన్ని ఎల్లో బ్రెయిన్‌ సాయంతో పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేశారు.

హైకోర్టు విభజన ఇప్పటికిప్పుడు జరిగే పనికాదని తేల్చేశారు. న్యాయవ్యవస్థను తీసుకెళ్లి గుడిసెల్లో పెట్టాలా అని న్యాయవ్యవస్థపై ఎనలేని గౌరవాన్ని ప్రదర్శించారు సోమిరెడ్డి. అంతేకాదు కీలకమైన తీర్పులిస్తుంటారు కాబట్టి న్యాయమూర్తులకు భద్రత, సరైన సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందన్నారు. అవన్నీ సిద్ధం చేసిన తర్వాతే హైకోర్టును తరలిస్తామన్నారు. ఇక్కడే సోమిరెడ్డి అసలు విషయం పక్కదారి పట్టించారు. తెలంగాణ న్యాయవాదులు, జడ్జిలు కోరుతున్నది ఏపీ హైకోర్టును హైదరాబాద్‌ నుంచి తరలించాలని కాదు. కేవలం జడ్జిలను విభజించి, కొత్త నియామకాల్లో తమ ప్రాంతానికి అవకాశం ఇవ్వాలని టీవాదులు కోరుతున్నారు. కావాలంటే ప్రస్తుత హైకోర్టు భవనాన్ని ఏపీ హైకోర్టు అవసరాల కోసం వాడుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం కూడా చెబుతోంది.

హైదరాబాద్‌లోనే అన్నిసదుపాయాలు ఉన్న భవనాలను అందించేందుకూ సిద్ధమంటోంది. కానీ చంద్రబాబు అండ్ కంపెనీ మాత్రం హైకోర్టుతోనే గేమ్స్ ఆడుతోంది. అన్నింటిని పంచాల్సిందే అంటున్న బాబు ప్రభుత్వం హైకోర్టు విషయంలో మాత్రం కలిసుంటేనే కలదు సుఖం అన్న స్లోగన్ ను లోలోపల అమలు చేస్తున్నారు. ఒక విధంగా తమ కోసం చంద్రబాబు పోరాడుతున్నారన్న భావన ఏపీ న్యాయవ్యవస్థలో కలిగించేందుకు బాబు బృందం పనిచేస్తున్నట్టుగా ఉంది. ఎలాగో కేంద్రంలో ఉన్నది కూడా చంద్రబాబు స్నేహితులే. రెండేళ్లు గడిచినా తాత్కాలిక రాజధాని కూడా నిర్మించలేకపోయిన చంద్రబాబు… ఇక శాశ్వత రాజధాని కట్టి అందులో అందమైన హైకోర్టు నిర్మించి కీలక తీర్పులు చెప్పే న్యాయమూర్తులకు అన్ని సదుపాయాలు సిద్దం చేసే సరికి చంద్రబాబు పదవీ కాలమే ముగుస్తుందనడంతో ఆశ్చర్యం లేదు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News