అప్పుడు అంతర్జాతీయ వార్త అవుతుంది... పరువుపోతుంది...

హైకోర్టు విభజన వెంటనే చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ న్యాయాధికారులు ఉద్యమబాట పట్టిన వేళ టీఆర్‌ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రెస్‌మీట్ పెట్టిన కవిత… తెలంగాణపై ఇంకా కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి జడ్జిల విభజన వరకు కుట్రలు చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. మల్లన్నసాగర్‌ వద్ద దొంగ దీక్షలు చేయడం కాదు… నిజంగా తెలంగాణ బిడ్డలే అయితే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీనేతలు హైకోర్టు ముందు దీక్షలు […]

Advertisement
Update: 2016-06-28 00:49 GMT

హైకోర్టు విభజన వెంటనే చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ న్యాయాధికారులు ఉద్యమబాట పట్టిన వేళ టీఆర్‌ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రెస్‌మీట్ పెట్టిన కవిత… తెలంగాణపై ఇంకా కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి జడ్జిల విభజన వరకు కుట్రలు చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. మల్లన్నసాగర్‌ వద్ద దొంగ దీక్షలు చేయడం కాదు… నిజంగా తెలంగాణ బిడ్డలే అయితే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీనేతలు హైకోర్టు ముందు దీక్షలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.

ఈ రెండేళ్ల కాలంలో 22 మంది తెలంగాణ ఐఏఎస్‌, ఐపీఎస్‌లను కోర్టు ధిక్కరణ కింద అకారణంగా జైలుకు పంపారని ఆమె ఆరోపించారు. తెలంగాణ భూముల అన్యాక్రాంతంపై హైకోర్టుకు వెళ్తే తిరిగి వాటిని పెట్టుబడిదారులకే అప్పగిస్తున్నారని ఆక్షేపించారామె.హైకోర్టు విభజన కోసం కేసీఆర్‌ ఢిల్లీలో దీక్ష చేసేందుకు కూడా వెనుకాడరని చెప్పారు. అయితే ఒక సీఎం వెళ్లి కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదంటూ దీక్ష చేస్తే అది ఇంటర్నేషన్ న్యూస్ అవుతుందన్నారు. అప్పుడు దేశం పరువు పోతుందని, రాజ్యాంగంపై ఒక మచ్చలా మిగిలిపోతుందన్నారు. కాబట్టి పరిస్థితిని అంతదూరం తీసుకురావద్దని కేంద్రప్రభుత్వాన్ని కవిత హెచ్చరించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News