రాజీనామా ఎఫెక్ట్? మైసూరారెడ్డి పంట పండింది

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మైసూరారెడ్డిపై ఎట్టకేలకు సీఎం చంద్రబాబు కరుణ చూపారు. మైసూరారెడ్డి కుమారుడికి చెందిన సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు కేటాయించారు. ఇందుకు ఏపీ కేబినెట్ ఆమోదముద్రవేసింది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం నిడుజువ్విలో 140 ఎకరాల భూమిని కేటాయించారు. ఎకరం రూ. 2. 4 లక్షల చొప్పుల భూమిని తేజ సిమెంట్స్‌కు అప్పగించనున్నారు. మైసూరారెడ్డి ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. మైసూరారెడ్డి రాజీనామా చేయడానికి కుమారుడి సిమెంట్స్ ఫ్యాక్టరీ భూముల వ్యవహారమే కారణమని అప్పట్లో […]

Advertisement
Update: 2016-06-24 05:26 GMT

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మైసూరారెడ్డిపై ఎట్టకేలకు సీఎం చంద్రబాబు కరుణ చూపారు. మైసూరారెడ్డి కుమారుడికి చెందిన సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు కేటాయించారు. ఇందుకు ఏపీ కేబినెట్ ఆమోదముద్రవేసింది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం నిడుజువ్విలో 140 ఎకరాల భూమిని కేటాయించారు. ఎకరం రూ. 2. 4 లక్షల చొప్పుల భూమిని తేజ సిమెంట్స్‌కు అప్పగించనున్నారు. మైసూరారెడ్డి ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు.

మైసూరారెడ్డి రాజీనామా చేయడానికి కుమారుడి సిమెంట్స్ ఫ్యాక్టరీ భూముల వ్యవహారమే కారణమని అప్పట్లో పెద్దెత్తున విమర్శలు వచ్చాయి. వైసీపీలో ఉంటే భూములు ఇచ్చే ప్రసక్తే లేదని టీడీపీ పెద్దలు స్పష్టం చేయడం వల్లే మైసూరారెడ్డి వైసీపీని వీడారని అప్పట్లో వార్తలు వచ్చాయి. వెళ్తూవెళ్తూ మైసూరారెడ్డి కూడా జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేసి వెళ్లారు. మొత్తం మీద ఇప్పుడు మైసూరారెడ్డి కుమారుడికి చెందిన సిమెంట్ ఫ్యాక్టరీకి ఏపీ ప్రభుత్వం భూములు ఇవ్వడంతో వైసీపీ ఆరోపణలకు కాస్త బలం చేకూరినట్టు అయింది. అయితే మైసూరారెడ్డి కుమారుడు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకునేందుకు ముఖ్యమంత్రిగా వైఎస్సే సాయం చేశారు. అయితే కొన్ని భూ కేటాయింపులు మాత్రం పెండింగ్‌లో ఉండిపోయాయి. వీటి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మైసూరారెడ్డి వైసీపీని వీడాల్సి వచ్చిందని చెబుతుంటారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News