అరగంటలోనే చెప్పిన తెలుగుగ్లోబల్‌.కామ్.... కోడెలపై చర్యలు తీసుకునే దమ్ము వ్యవస్థలకు ఉందా?

ఆదివారం ఒక తెలుగు న్యూస్ ఛానల్‌ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఎమ్మెల్యే ఎన్నికల్లో 28లక్షలకు మించి ఖర్చు పెట్టేందుకు వీల్లేదని ఈసీ నిబంధనలు చెబుతుంటే… స్పీకర్‌గానూ ఉన్న కోడెల శివప్రసాదరావు తాను మొన్నటి ఎన్నికల్లో ఏకంగా 11.5 కోట్లు ఖర్చు పెట్టానని స్వయంగా ప్రకటించుకున్నారు. 83లో 30వేలు ఖర్చుపెట్టానని, మొన్న 11.5కోట్లు ఖర్చు అయిందని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలను సదరు ఛానల్‌ కూడా హైలైట్ […]

Advertisement
Update: 2016-06-21 00:36 GMT

ఆదివారం ఒక తెలుగు న్యూస్ ఛానల్‌ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఎమ్మెల్యే ఎన్నికల్లో 28లక్షలకు మించి ఖర్చు పెట్టేందుకు వీల్లేదని ఈసీ నిబంధనలు చెబుతుంటే… స్పీకర్‌గానూ ఉన్న కోడెల శివప్రసాదరావు తాను మొన్నటి ఎన్నికల్లో ఏకంగా 11.5 కోట్లు ఖర్చు పెట్టానని స్వయంగా ప్రకటించుకున్నారు. 83లో 30వేలు ఖర్చుపెట్టానని, మొన్న 11.5కోట్లు ఖర్చు అయిందని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలను సదరు ఛానల్‌ కూడా హైలైట్ చేయకుండా మౌనంగా ఉండిపోయింది. ఆయన చేసిన వ్యాఖ్యలను మొదటి అరగంటలోనే తెలుగుగ్లోబల్. కామ్‌ ప్రచురిచింది. స్పీకర్ చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవనిచ సంచలనం సృష్టించే అవకాశం ఉందని తెలుగుగ్లోబల్.కామ్ వెళ్లడించింది.

ఇప్పడు కోడెల వ్యాఖ్యలను ప్రముఖ పత్రికల మంగళవారం ప్రచురించడంతో కలకలం రేగుతోంది. అయితే కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యలు చట్టవిరుద్దమే. కానీ ఆయనపై చర్యలు తీసుకునే దమ్ము వ్యవస్థలకు ఉందా అన్నది ఇప్పుడు తేలాలి. పైగా కోడెల శివప్రసాదరావు పవిత్రమైన స్పీకర్‌ స్థానంలో ఉన్నారు. మిగిలిన సభ్యులకు ఆదర్శవంతంగా ఉండాల్సిన వ్యక్తి ఆయన. కానీ ఈసీ సుమోటోగా స్వీకరించి ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తుందా?. అలా చేయని పక్షంలో ఎవరైనా కోర్టులను ఆశ్రయిస్తారా?. అయినా ఇప్పటికే వ్యవస్థలన్నీ చంద్రబాబు చేతుల్లో బంధీలుగా ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. స్టేట్‌లో వారిదే ప్రభుత్వం, సెంట్రల్‌లోనూ మిత్రపక్షానిదేఅధికారం కాబట్టి స్పీకర్‌పై చర్యలు తీసుకుంటారని ఆశించడం దురాశే అవుతుందేమో. ఇక నైతికత అంటారా… అది మననేతల్లో నశించి చాలా కాలమే అయింది.

Click on Image to Read:

 

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC