వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు... భూమాలాంటిదేనా?

కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఏవోను దూషించారంటూ ఆయనపై కేసు నమోదైంది. సోమవారం ఏరువాక కార్యక్రమం నేపథ్యంలో ఉదయం 10.30కు రావాల్సిందిగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి ఏవో ఆహ్వానం పంపారు. అయితే ఇంతలోనే టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సుధాకర్ యాదవ్‌తో ఏరువాక కార్యక్రమాన్ని ఉదయం 9.30కే నిర్వహించారు. తనను 10.30 కు రావాల్సిందిగా చెప్పి ముందే కార్యక్రమం నిర్వహించడంపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ విషయంలో ఏవో లక్ష్మణ్ కుమార్‌ను […]

Advertisement
Update: 2016-06-20 22:08 GMT

కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఏవోను దూషించారంటూ ఆయనపై కేసు నమోదైంది. సోమవారం ఏరువాక కార్యక్రమం నేపథ్యంలో ఉదయం 10.30కు రావాల్సిందిగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి ఏవో ఆహ్వానం పంపారు. అయితే ఇంతలోనే టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సుధాకర్ యాదవ్‌తో ఏరువాక కార్యక్రమాన్ని ఉదయం 9.30కే నిర్వహించారు. తనను 10.30 కు రావాల్సిందిగా చెప్పి ముందే కార్యక్రమం నిర్వహించడంపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ విషయంలో ఏవో లక్ష్మణ్ కుమార్‌ను నిలదీశారు.

దీంతో ఆయన వెళ్లి ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఇది అక్రమ కేసు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలే ఏవో చేత తప్పుడు కేసు పెట్టించారని అంటున్నారు. గతంలో భూమానాగిరెడ్డి వైసీపీలో ఉన్న సమయంలోనూ ఇదే తరహాలోనే తప్పుడు కేసులు పెట్టారని, ఇంకా అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలపైనా ఇలాంటి కేసులే నమోదుచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News