కాపు మంత్రులపై కుల బహిష్కరణ వేటు... ఇకపై ఎన్నికల కోసం ఎదురుచూస్తాం బాబు!

ముద్రగడ దీక్షను అవహేళన చేయడంతో పాటు, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస్, చినరాజప్పపై కాపు సంఘాలు భగ్గుమన్నాయి. మంత్రులపై కుల బహిష్కరణ వేటు వేస్తున్నట్టు సంఘాలు ప్రకటించాయి. కాపు మంత్రులు, కొందరు టీడీపీ కాపు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు తొత్తులుగా మారి, బాబుపల్లకి మోస్తూ సొంతజాతికే తీరని ద్రోహం చేశారని అందుకే వారిపై కుల బహిష్కరణ వేటు వేస్తున్నట్టు కాపు జాగృతి సంఘం ప్రకటించింది. నెల్లూరుకాపు సంఘం కూడా ఇదే తీర్మానం చేసింది. […]

Advertisement
Update: 2016-06-19 00:54 GMT

ముద్రగడ దీక్షను అవహేళన చేయడంతో పాటు, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస్, చినరాజప్పపై కాపు సంఘాలు భగ్గుమన్నాయి. మంత్రులపై కుల బహిష్కరణ వేటు వేస్తున్నట్టు సంఘాలు ప్రకటించాయి. కాపు మంత్రులు, కొందరు టీడీపీ కాపు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు తొత్తులుగా మారి, బాబుపల్లకి మోస్తూ సొంతజాతికే తీరని ద్రోహం చేశారని అందుకే వారిపై కుల బహిష్కరణ వేటు వేస్తున్నట్టు కాపు జాగృతి సంఘం ప్రకటించింది. నెల్లూరుకాపు సంఘం కూడా ఇదే తీర్మానం చేసింది.

ఇకపై టీడీపీ కాపు మంత్రులు, ముద్రగడకు వ్యతిరేకంగా మాట్లాడిన కాపు ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లవద్దని కాపులకు సంఘాలు పిలుపునిచ్చాయి. టీడీపీ కాపు ప్రజాప్రతినిధుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వెళ్లవద్దని, కనీసం వారి ఇళ్లకు వెళ్లి భోజనాలు కూడా చేయవద్దని కాపు సంఘాలనాయకులు సూచించారు. ప్రతి కాపు దీనికి కట్టుబడి ఉంటాలని కోరారు. కాపు మంత్రులు కుల ద్రోహులుగా మారి చంద్రబాబు పల్లకి మోస్తున్నారని కాపు జాగృతి కన్వీనర్ సతీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మూడేళ్లలో వీరికి రాజకీయ మనుగడ లేకుండా చేస్తామని ప్రకటించారు.

ముద్రగడను శారీరకంగా, మానసికంగా చంద్రబాబు దెబ్బతీశారని… బాబు సర్కార్‌కు త్వరలోనే నూకలు చెల్లుతాయని హెచ్చరించారు. ఇప్పటి నుంచి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని కాపులమంతా ఎదురుచూస్తుంటామని చెప్పారు. మంత్రులు నారాయణ, గంటా, చినరాజప్పపై కుల బహిష్కరణ వేటువేసినట్టు ప్రముఖ కాపు నేత చింతాల వెంకట్రావ్ తెలిపారు. ముగ్గురు మంత్రులు కలిసి ముద్రగడ నిజాయితీని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని, ఇది క్షమించరాని తప్పు అని అన్నారు. చంద్రబాబుకు అనుకూలంగా, ముద్రగడకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యేలకు కుల బహిష్కరణ వర్తిస్తుందని కాపు సంఘాల నాయకులు వెల్లడించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News