అప్ప‌ట్లో మోనికాబేడీ... ఇప్పుడు మ‌మ‌తా కుల‌క‌ర్ణి!

ముంబైలో మాఫియాకు.. బాలీవుడ్ హీరోయిన్ల‌కు అవినాభావ సంబంధం ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే! అప్ప‌ట్లో దావూద్ ప్రియురాలు మందాకిని (తెలుగుతో సింహాస‌నంలో హీరోయిన్‌), తాజ్‌మ‌హ‌ల్ సినిమాతో తెలుగులో హిట్ కొట్టిన మోనికాబేడీలకు మాఫియాతో ఉన్న సంబంధాలు బ‌ట్ట‌బ‌య‌లైన సంగ‌తి తెలిసిందే. తాజాగా తెలుగులో న‌టించిన మరో ఉత్తారాది తారకూ మాఫియాతో ఉన్న సంబంధాలు వెలుగుచూశాయి. ఈవీవీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మానాన్న‌కు పెళ్లి అనే సినిమాలో “మ‌మ‌తా కుల‌క‌ర్ణి.. మా కుల‌దేవ‌త‌..” అంటూ ఎంస్ నారాయ‌ణ చెప్పిన‌  డైలాగ్ ఎంత […]

Advertisement
Update: 2016-06-18 22:08 GMT
ముంబైలో మాఫియాకు.. బాలీవుడ్ హీరోయిన్ల‌కు అవినాభావ సంబంధం ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే! అప్ప‌ట్లో దావూద్ ప్రియురాలు మందాకిని (తెలుగుతో సింహాస‌నంలో హీరోయిన్‌), తాజ్‌మ‌హ‌ల్ సినిమాతో తెలుగులో హిట్ కొట్టిన మోనికాబేడీలకు మాఫియాతో ఉన్న సంబంధాలు బ‌ట్ట‌బ‌య‌లైన సంగ‌తి తెలిసిందే. తాజాగా తెలుగులో న‌టించిన మరో ఉత్తారాది తారకూ మాఫియాతో ఉన్న సంబంధాలు వెలుగుచూశాయి. ఈవీవీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మానాన్న‌కు పెళ్లి అనే సినిమాలో “మ‌మ‌తా కుల‌క‌ర్ణి.. మా కుల‌దేవ‌త‌..” అంటూ ఎంస్ నారాయ‌ణ చెప్పిన‌ డైలాగ్ ఎంత ఫేమ‌స్సో తెలుసుక‌దా! 90వ ద‌శ‌కంలో ఉత్త‌రాదిన‌, ద‌క్షిణాదిన ఒక ఊపు ఊపిన భామ పేరు డ్ర‌గ్స్ కేసులో చిక్కుకుంది. అప్ప‌ట్లో మాఫియా డాన్ అబూల‌స‌లేంతో ప్రేమాయ‌ణం న‌డిపిన మోనికాబేడీ కొంత‌కాలం క‌ట‌క‌టాలు లెక్క‌బెట్టిన సంగ‌తి తెలిసిందే! ప్ర‌స్తుతం మ‌మ‌తా కుల‌క‌ర్ణి దాదాపు రూ.2 వేల కోట్ల డ్ర‌గ్స్ కుంభకోణంలో చిక్కుకున్నారు. డ్ర‌గ్ మాఫియాకు చెందిన కొంద‌రిని ముంబై పోలీసులు విచారిస్తోన్న క్ర‌మంలో మ‌మ‌త పేరు బ‌య‌ట‌ప‌డ‌టం సంచ‌ల‌నం రేపింది.
తెలుగులో మ‌మ‌త ప్రేమ‌శిఖరం (1992), దొంగ‌పోలీస్ (1991) సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించారు. 44 ఏళ్ల‌ మ‌మ‌తా కుల‌క‌ర్ణి పెళ్లి చేసుకున్న త‌రువాత సినిమాల‌కు దూర‌మ‌య్యారు. భ‌ర్త విక్కీతో క‌లిసి కెన్యాలో ఉంటున్నారు. తాజాగా వెలుగుచూసిన డ్ర‌గ్‌మాఫియా కెన్యా నుంచే ర‌న్ కావ‌డం, మ‌మ‌తా దంప‌త‌లు పేర్లు బ‌య‌టికి రావ‌డంతో జాతీయ‌స్థాయిలో దుమారం రేపుతోంది. ప్ర‌స్తుతం కెన్యాలో ఉన్న మ‌మ‌త‌ను ఇండియాకు ర‌ప్పించే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను మ‌మ‌తా ఖండించారు. త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News