ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయడం కూడా వైసీపీకి రాదా?

పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అంశంపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించారు. తన వద్దకు వచ్చిన అనర్హత పిటిషన్లలో కొన్ని పద్దతిప్రకారం ఉన్నాయని… మరికొన్ని సరైన పద్దతిలో లేవని చెప్పారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునేందుకు ఒక పద్దతి ఉందన్నారు. అది టైమ్‌ తీసుకుంటుందని చెప్పారు. అంతా ఒక పద్దతి ప్రకారమే జరుగుతుందన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు రక్షణగా నిలవాల్సిన అవసరం తనకేంముందని ప్రశ్నించారు. స్పీకర్‌గా తన బాధ్యతను మరిచిపోనన్నారు. ఫిరాయింపులు దేశం మొత్తం ఉన్నాయన్నారు. ఇవి […]

Advertisement
Update: 2016-06-19 09:08 GMT

పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అంశంపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించారు. తన వద్దకు వచ్చిన అనర్హత పిటిషన్లలో కొన్ని పద్దతిప్రకారం ఉన్నాయని… మరికొన్ని సరైన పద్దతిలో లేవని చెప్పారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునేందుకు ఒక పద్దతి ఉందన్నారు. అది టైమ్‌ తీసుకుంటుందని చెప్పారు. అంతా ఒక పద్దతి ప్రకారమే జరుగుతుందన్నారు.

ఫిరాయించిన ఎమ్మెల్యేలకు రక్షణగా నిలవాల్సిన అవసరం తనకేంముందని ప్రశ్నించారు. స్పీకర్‌గా తన బాధ్యతను మరిచిపోనన్నారు. ఫిరాయింపులు దేశం మొత్తం ఉన్నాయన్నారు. ఇవి కొత్తేమీ కాదని కోడెల చెప్పారు. ఫిరాయింపుల చట్టాన్ని అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటానని అన్నారు. ఒకవేళ వారు తప్పుచేసినట్టు తేలితే అనర్హత వేటు వేస్తారా అన్న ప్రశ్నకు కోడెల నేరుగా స్పందించలేదు. చట్టాన్ని అధ్యయనం చేస్తున్నానని… చూద్దాం. స్డడీ చేయాలి కదా అని అన్నారు స్పీకర్ కోడెల. తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఫిరాయింపులు తప్పు అని ఆయన అన్నారు. ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోడెల శివప్రసాదరావు ఈ వ్యాఖ్యలు చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News