తన ఎన్నికల ఖర్చుపై కోడెల సంచలన వ్యాఖ్యలు...

ఒక తెలుగు టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొన్నికీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోనూ కాంగ్రెస్ సంస్కృతి వచ్చేసింది…దోచుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది దీనికి మీరేంమంటారు అన్న ప్రశ్నకు కోడెల శివప్రసాదరావు స్పందించారు. ”2004 నుంచి రాజకీయాల్లో డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం 10 కోట్లు అవసరం అవుతోంది.  నేను 1983లో తొలిసారి పోటీ చేసినప్పుడు కేవలం 30వేల రూపాయలు ఖర్చు అయింది. అదికూడా చందాలు వేసుకుని ఖర్చు చేశాం. […]

Advertisement
Update: 2016-06-19 08:43 GMT

ఒక తెలుగు టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొన్నికీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోనూ కాంగ్రెస్ సంస్కృతి వచ్చేసింది…దోచుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది దీనికి మీరేంమంటారు అన్న ప్రశ్నకు కోడెల శివప్రసాదరావు స్పందించారు.

”2004 నుంచి రాజకీయాల్లో డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం 10 కోట్లు అవసరం అవుతోంది. నేను 1983లో తొలిసారి పోటీ చేసినప్పుడు కేవలం 30వేల రూపాయలు ఖర్చు అయింది. అదికూడా చందాలు వేసుకుని ఖర్చు చేశాం. కానీ మొన్నటి ఎన్నికల్లో 11.5 కోట్లు ఖర్చు అయింది” అని చెప్పారు. ఎన్నికల నిబంధన ప్రకారం ఎమ్మెల్యే ఎన్నికల్లో అంతస్థాయిలో ఖర్చు పెట్టేందుకు నిబంధనలు ఒప్పుకోవు.

మరి కోడెల శివప్రసాదరావు మొన్నటి ఎన్నికల్లో పదకొండున్నర కోట్లు ఖర్చు అయిందని బహిరంగంగా చెప్పడం ఆశ్చర్యంగానే ఉంది. బహుశా ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో గానీ భారీగా ఎన్నికల వ్యయం పెరిగిందని చెప్పారు. ఇలా ఎన్నికల వ్యయం పెరగడం వల్లే కొందరు నాయకులు తప్పుదారి పడుతుండవచ్చన్నారు. కానీ అది తప్పు అని చెప్పారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి టీడీపీయే సరైన ప్రత్యామ్నాయం అని చెప్పారు. చంద్రబాబు ఒక సమర్ధవంతమైన నాయకుడని కోడెల చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News