మేమూ రెచ్చగొట్టగలం... మమ్మల్ని అర నిమిషం కూడా చూపించరా!

ముద్రగడ, కాపుల విషయంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని కాపు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లంరాజు నివాసంలో సమావేశమైన దాసరి, చిరు, బొత్స, అంబటి, సీ. రామచంద్రయ్య తదితరులు తాజా పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దాసరి నారాయణరావు… ముద్రగడ విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని విమర్శించారు. ముద్రగడ ప్రాణాలతో చెలగాటమాడేలా ఏ మంత్రి స్టేట్‌మెంట్ ఇచ్చినా అందుకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ముద్రగడ దీక్షను అవహేళన చేసేలా కాపు మంత్రులతో […]

Advertisement
Update: 2016-06-17 11:01 GMT

ముద్రగడ, కాపుల విషయంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని కాపు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లంరాజు నివాసంలో సమావేశమైన దాసరి, చిరు, బొత్స, అంబటి, సీ. రామచంద్రయ్య తదితరులు తాజా పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దాసరి నారాయణరావు… ముద్రగడ విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని విమర్శించారు. ముద్రగడ ప్రాణాలతో చెలగాటమాడేలా ఏ మంత్రి స్టేట్‌మెంట్ ఇచ్చినా అందుకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

ముద్రగడ దీక్షను అవహేళన చేసేలా కాపు మంత్రులతో చంద్రబాబే మాట్లాడిస్తున్నట్టుగా ఉందన్నారు. ఆరు రోజులు దీక్ష చేసినా వైద్య పరీక్షలలో అన్నీ సాధారణంగానే ఎలా ఉన్నాయోనంటూ మంత్రులు వెటకారంగా మాట్లాడారని దాసరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముద్రగడ నిజాయితీని, కాపు జాతి నిజాయితీని అవమానించడమే అవుతుందన్నారు. కాపు మంత్రుల ప్రకటన వెనుక చంద్రబాబు హస్తం లేకుంటే వెంటనే మంత్రులిద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్‌ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమకూ రెచ్చగొట్టడం వచ్చునని కానీ సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. ఎమర్జెన్సీ రోజుల్లో కూడా మీడియాపై ఇంతలా నియంత్రణ విధించలేదని దాసరి విమర్శించారు. కీలకమైన అంశంపై తామంతా సమావేశమై విషయం చెబుతుంటే.. కొన్ని ఛానళ్లలో అర నిమిషం కూడా రాలేదని, వాళ్ల బాధలేంటో తనకు తెలుసని దాసరి అన్నారు. మీడియాపై ప్రభుత్వం కత్తిపెట్టిన విషయం తెలుసన్నారు. దాసరి మీడియాపై అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత కూడా టీడీపీ అనుకూల టీవీ ఛానళ్లు … కాపు నేతల మీటింగ్ గురించి అర నిమిషం కూడా చూపించకపోవడం గమనార్హం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News