మోత్కుపల్లితో బజారునపడి కొట్టుకున్నప్పుడు ఏమైంది? మేం జానారెడ్డిలా కాదు...

కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మనోవేదనకు గురిచేశాయని అందుకే పార్టీ మారుతున్నానని ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డి చెప్పడంపై మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. మనోవేదనకు గురయ్యానని గుత్తా చెప్పడం పెద్ద జోక్ అన్నారు. గుత్తా టీడీపీలో ఉన్నప్పుడు 15 ఏళ్ల పాటు మోత్కుపల్లితో బజారునపడి కొట్టుకున్నారని అప్పుడు మనోవేదన కలగలేదా అని ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసమే గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్‌రావు పార్టీ వీడారని ఆరోపించారు. గుత్తా, భాస్కర్‌రావు పార్టీ వీడడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. […]

Advertisement
Update: 2016-06-14 03:16 GMT

కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మనోవేదనకు గురిచేశాయని అందుకే పార్టీ మారుతున్నానని ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డి చెప్పడంపై మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. మనోవేదనకు గురయ్యానని గుత్తా చెప్పడం పెద్ద జోక్ అన్నారు. గుత్తా టీడీపీలో ఉన్నప్పుడు 15 ఏళ్ల పాటు మోత్కుపల్లితో బజారునపడి కొట్టుకున్నారని అప్పుడు మనోవేదన కలగలేదా అని ప్రశ్నించారు.

స్వప్రయోజనాల కోసమే గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్‌రావు పార్టీ వీడారని ఆరోపించారు. గుత్తా, భాస్కర్‌రావు పార్టీ వీడడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అని గుత్తా చెప్పడాన్ని కోమటిరెడ్డి తప్పుపట్టారు. అవసరమైతే కాదు ముందు నైతికత ఉంటే రాజీనామా చేయండి అని డిమాండ్ చేశారు. మూడుసార్లు ఎంపీగా పనిచేసిన గుత్తా రాజీనామా చేసి ఆదర్శంగా ఉండాలన్నారు. తాము జానారెడ్డిలాగా అస్త్ర సన్యాసం చేసే రకం కాదన్నారు. తాము యుద్ధం ప్రకటించే రకమని చెప్పారు.

అంతకుమందు మీడియాతో మాట్లాడిన జానారెడ్డి… తెలంగాణ కోసం తాను సీఎం పదవిని కూడా తిరస్కరించానని చెప్పారు. పార్టీకి మంచి జరుగుతుందంటే సీఎల్పీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమన్నారు. భ్రష్టు రాజకీయాలతో బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పార్టీని వీడినవారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News