పేదోడి వినతులు చూసి వైఎస్ చలించిపోయారు

దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే భిన్నంగా ఏపీలో పాలన అడ్డగోలుగా  సాగుతోందని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు విమర్శించారు.  చంద్రబాబు పాలన పక్షపాత ధోరణితో సాగుతోందని విమర్శించారు. తనకు మద్దతిచ్చిన వారికి, తన కులం వారికే సంక్షేమపథకాలు అందజేస్తానని చెప్పడం దారుణమన్నారు. గతంలో వైఎస్ కులం, మతం, ప్రాంతం, పార్టీ వంటి తేడాలు లేకుండా అందరికీ సంక్షేమపథకాలు అందించారని చెప్పారు. ఆ పాలన చూసి చంద్రబాబు పాలన చూస్తుంటే విచిత్రంగా ఉందన్నారు. ఎదుటి పార్టీ వారికి కూడా […]

Advertisement
Update: 2016-06-14 01:17 GMT

దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే భిన్నంగా ఏపీలో పాలన అడ్డగోలుగా సాగుతోందని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. చంద్రబాబు పాలన పక్షపాత ధోరణితో సాగుతోందని విమర్శించారు. తనకు మద్దతిచ్చిన వారికి, తన కులం వారికే సంక్షేమపథకాలు అందజేస్తానని చెప్పడం దారుణమన్నారు. గతంలో వైఎస్ కులం, మతం, ప్రాంతం, పార్టీ వంటి తేడాలు లేకుండా అందరికీ సంక్షేమపథకాలు అందించారని చెప్పారు. ఆ పాలన చూసి చంద్రబాబు పాలన చూస్తుంటే విచిత్రంగా ఉందన్నారు.

ఎదుటి పార్టీ వారికి కూడా సంక్షేమపథకాలు అందించడంపై అప్పట్లో కొందరు వైఎస్‌ వద్ద అభ్యంతరం వ్యక్తంచేశారని… కానీ ఆయన మాత్రం ఎన్నికలు అయిపోయాక ప్రజలంతా మనవారేనన్న ధోరణితో ముందుకెళ్లారన్నారు. ఆరోగ్యసమస్యల వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఆదుకోవాలంటూ నిత్యం అనేక వినతులు వైఎస్ వద్దకు వచ్చేవని ధర్మాన చెప్పారు. వాటన్నింటిని చూసిన తర్వాత శాశ్వత పరిష్కారంగా ఆరోగ్యశ్రీని వైఎస్ తీసుకొచ్చారన్నారు. పేదవాడు నేరుగా కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుని ధైర్యంగా ఉండగలుగుతున్నారంటే అందుకు వైఎస్సే కారణమని చెప్పారు. చదువుకు పేరికం అడ్డురాకూడదని ఆలోచన చేసిన మహానుభావుడు వైఎస్ అని అన్నారు. రైతులను ఆదుకునేందుకు దాదాపు 60 ఏళ్ల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కష్టపడి బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించే వ్యవస్థను తయారు చేస్తే… చంద్రబాబు మాత్రం రుణమాఫీ పేరుతో ఒకేసారి 60ఏళ్ల రుణ వ్యవస్థను కుప్పకూల్చేశారని ధర్మాన విమర్శించారు.

2009 నుంచి 20014 వరకు దేశంలో లక్ష మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే థర్మల్ ప్లాంట్లను నిర్మించారని ధర్మాన చెప్పారు. 2014 తర్వాత బొగ్గు ధరలు 120 డాలర్ల నుంచి 30డాలర్లకు పడిపోవడంతో మోడీ సర్కార్ థర్మల్ ప్లాంట్ల నుంచి పూర్తిస్తాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్రాలకు ఇస్తోందన్నారు. దీన్ని కూడా తాను అధికారం చేపట్టగానే 24 గంటల కరెంట్ సాధ్యమైందని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందని ధర్మాన ఎద్దేవా చేశారు. ఇసుక అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు ఒక మహిళా తహసీల్దార్ ప్రయత్నిస్తే … ఆమెను పిలిపించుకుని ఇసుక రీచ్ వద్దకు ఎందుకెళ్లావని ఒక ముఖ్యమంత్రే ప్రశ్నిస్తే ఇక దిక్కెవరని ధర్మాన అన్నారు.

అనుభవం ఉన్నవాడు కదా అని అధికారం ఇస్తే మరో నాలుగు ఎక్కువ తగిలించండి అన్నట్టుగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. కేంద్రం 12 సంస్థలను మంజూరు చేస్తే ఒక్కటైనా వెనుకబడిన జిల్లాల్లో స్థాపించారా అని నిలదీశారు. ఇలా చేస్తే ఆయా ప్రాంత ప్రజలకు కడుపు మండదా అని నిలదీశారు. అభివృద్ధిని ఒకే ప్రాంతంలో కేంద్రీకరించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేందుకు చంద్రబాబు బీజం వేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వీడిపోవడానికి కారణమైన పరిస్థితులను ఇప్పుడు ఏపీలోనూ చంద్రబాబు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News